ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Apprentice Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 4వేల అప్రెంటిస్‌ ఖాళీలు

ABN, Publish Date - Feb 20 , 2025 | 05:28 AM

2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారే ఈ ఉద్యోగాలకు అర్హులు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలోని ప్రముఖ బ్యాంకులైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు అప్రెంటిస్‌ ఉద్యోగాల కోసం విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారే ఈ ఉద్యోగాలకు అర్హులు. యూనియన్‌ బ్యాంకులో మొత్తం 2,691 అప్రెంటిస్‌ ఖాళీలు ఉండగా, వీటిలో తెలంగాణలో 304, ఆంధ్రప్రదేశ్‌లో 549 ఖాళీలు ఉన్నాయి. మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశమిచ్చారు. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 4,000 అప్రెంటిస్‌ ఖాళీలు ఉండగా, ఇందులో తెలంగాణలో 193, ఆంధ్రప్రదేశ్‌లో 59 ఖాళీలు ఉన్నాయి.


ఈ పోస్టుల్లో చేరాలనుకునే అభ్యర్థులు నేషనల్‌ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌లో తప్పని సరిగా రిజిస్టరై ఉండాలి. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 11వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరోవైపు, రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరో 518 పోస్టుల భర్తీకి కూడా బ్యాంక్‌ బరోడా నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో సీనియర్‌ మేనేజర్‌ మొదలుకొని నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ వరకు పలు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మార్చి 11వ తేదీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ శుక్రవారం వరకు పొడిగించింది.


ఇవి కూడా చదవండి:

Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 20 , 2025 | 05:28 AM