ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kejriwal: ప్రజలకు దూరమైన సామాన్యుడు!

ABN, Publish Date - Feb 09 , 2025 | 05:21 AM

హరియాణాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ప్రస్థానం అసామాన్యంగా సాగింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన కేజ్రీవాల్‌..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం వరకూ ఎదిగిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక్కసారిగా నేలకూలారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఆయన రాజకీ య భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హరియాణాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ప్రస్థానం అసామాన్యంగా సాగింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన కేజ్రీవాల్‌.. 1992లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసె్‌స(ఐఆర్‌ఎ్‌స)లో చేరారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి చేసిన కృషికి గా ను 2006లో రామన్‌ మెగసెసే అవార్డును అందుకున్నారు. ఆయన స్థాపించిన పరివర్తన్‌ సంస్థ ఢిల్లీలో నకిలీ రేషన్‌ కార్డుల స్కాంను వెలుగులోకి తెచ్చింది. 2013లో కేజ్రీవాల్‌ తొలిసారి ఢిల్లీ సీఎం అయ్యారు. అయితే అసెంబ్లీలో జన్‌ లోక్‌పాల్‌ బిల్లును ఆమోదించడంలో ఆయన పార్టీ విఫలం కావడంతో 49 రోజు ల తర్వాత తన ప్రభుత్వాన్ని రద్దుచేసి సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అవినీతిపై పోరాటంలో భాగంగా అత్యున్నత పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధపడిన సూత్రప్రాయమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు లభించింది. ఇది ఢిల్లీ అసెంబ్లీకి 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్‌ భారీ విజయాలు సాధించింది.


కామన్‌ మ్యాన్‌ ఇమేజ్‌కు దెబ్బ

ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్‌ ఎదుగుదల ‘ఆమ్‌ ఆద్మీ’గా ఆయన ఇమేజ్‌తో ముడిపడి ఉంది. అవినీతి వ్యతిరేక కార్యకర్త నుంచి ఢిల్లీ సీఎంగా ఎదిగిన ఆయన ప్రయాణం సగటు పౌరుడితో తనకున్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. కేజ్రీవాల్‌ తరచుగా సాధారణ దుస్తుల్లో కనిపిస్తుంటారు. పెద్ద సైౖజు చొక్కా, మెడకు చుట్టుకున్న మఫ్లర్‌.. ఇవే ఒక ట్రేడ్‌మార్క్‌గా మారి ‘మఫ్లర్‌ మ్యాన్‌’ అని పేరు తెచ్చాయి. అయితే కొద్దికాలంగా ఆయన పఫర్‌ జాకెట్‌లో కనిపించడాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా మార్చుకుంది. కేజ్రీవాల్‌ ధరించే ఒక్కో జాకె ట్‌ ఖరీదు రూ.25వేలు అని ఆరోపించింది. దీన్ని కేజ్రీవాల్‌ ఖండించినా ‘కామన్‌ మ్యాన్‌’ ఇమేజ్‌ను దెబ్బతీసింది. అవినీతిని నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించారు. అయితే జన్‌ లోక్‌పాల్‌ అని నినదించిన కేజ్రీవాల్‌ ప్రారంభించిన పార్టీ స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:21 AM