ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

S-350 Air Defence System: అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం.. రష్యాకు ఉక్రెయిన్ షాక్

ABN, Publish Date - Feb 19 , 2025 | 09:08 PM

శాంతి చర్చలు మొదలు కానున్న వేళ ఉక్రెయిన్ రష్యాకు భారీ షాకిచ్చింది. రష్యాకు అత్యాధునిక ఎస్-350 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను తాము ధ్వంసం చేసినట్టు తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా నేతృత్వంలో చర్చలు మొదలు కానున్న వేళ రష్యాకు భారీ షాక్ తగిలింది. రష్యాలో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థగా పేరు పడ్డ ఎస్-350 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తాము ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పంచుకుంది. అయితే, ఈ దాడి ఎప్పుడు చేసిందీ ఉక్రెయిన్ వెల్లడించలేదు. ఇది నిజమైతే రష్యాకు యుద్ధభూమిలో భారీ షాక్ తగిలినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇక రష్యా మాత్రం ఈ వీడియోపై మౌనం పాటిస్తోంది (Ukraine).

Trump Zelensky : యుద్ధం మొదలుపెట్టిందే మీరు.. ఈ మూడేళ్లు ఏం చేశారు.. జెలెన్ స్కీపై ట్రంప్ ఫైర్..


రష్యా సైన్యానికి చెందిన ఆర్టిలరీ నిఘా విభాగం బ్లాక్ ఫారెస్ట్ బ్రిగేడ్ ఈ వీడియోను పోస్టు చేసింది. డ్రోన్ల ద్వారా ఈ వీడియోను రికార్డు చేసినట్టు తెలిపింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, పొలాల మధ్య ఎస్-350 వ్యవస్థకు చెందిన వాహనాలు ప్రయాణిస్తుండగా సడెన్‌గా జరిగిన దాడిలో అవి పూర్తిస్థాయిలో ధ్వంసమైపోయాయి. ఉక్రెయిన్ మీడియా కథనాల ప్రకారం, ఎస్-350ని శత్రుదేశానికి మధ్యశ్రేణి క్షిపణులను అడ్డుకునేందుకు రష్యా రూపొందించింది. ఈ కొత్తతరం అత్యాధునిక క్షిపణి విధ్వంసక వ్యవస్థను 2020లోనే రష్యా సైన్యంలో ప్రవేశపెట్టారు. ఒకప్పటి ఎస్-300పీఎస్, బుక్-ఎమ్1-2 క్షిపణి విధ్వంసక వ్యవస్థల స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. 120 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఇది సులువగా ధ్వంసం చేయగలదు. క్రూయిజ్ మిసైల్స్, టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు, యూఏవీలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు ధ్వంసం చేయగలదు. ఏఐ వ్యవస్థ కూడా ఉండటంతో మనుషుల అవసరం లేకుండానే ఇది శత్రు దేశ మిసైల్లను గుర్తించి నాశనం చేస్తుంది.


Vatican City: ఆందోళనకరంగా పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి.. వైద్యులు ఏం చెప్పారంటే..

అయితే, ఎస్-350 క్షిపణి విధ్వంసక వ్యవస్థను ఉక్రెయిన్ ధ్వంసం చేసిందన్న వార్త భారత్‌, చైనాలకు ఆందోళన కారకమని నిపుణులు చెబుతున్నారు. రష్యాకు చెందిన ఎస్-300 డిఫెన్స్ వ్యవస్థ ఆధారంగా ఎస్-350, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను తయారు చేశారు. ఈ రెండిటినీ భారత్, చైనాలు పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకున్నాయి. ఎస్-400 సామర్థ్యం ఎక్కువైనప్పటికీ ఈ వ్యవస్థలన్నీ ఒకే తరగతికి చెందినవని నిపుణులు చెబుతున్నారు. ఎస్-350 ధ్వంసం నిజమేనని రష్యా ధ్రువీకరిస్తే మాత్రం భారత్‌‌కు ఇది ఆందోళనకరమేనని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 09:16 PM