ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trump on Gaza: గాజాకు తిరిగి వచ్చే హక్కు పాలస్తీనియన్లకు ఉండదు

ABN, Publish Date - Feb 11 , 2025 | 05:05 AM

గాజా అమెరికా ఆధీనంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాంతంలోకి తిరిగి వచ్చే హక్కును పాలస్తీనావాసులకు ఇవ్వబోమని చెప్పారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 10: యుద్ధభూమిగా మారిన గాజాను అమెరికా స్వాధీనంలోకి తెచ్చుకుంటుందని గతంలో చెప్పిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశారు. గాజా అమెరికా ఆధీనంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాంతంలోకి తిరిగి వచ్చే హక్కును పాలస్తీనావాసులకు ఇవ్వబోమని చెప్పారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో తాము నివాసముండే స్థలం గాజాయేనని పాలస్తీనావాసులు భావిస్తుండగా, వారిలో ఆ భావన తొలగేలా కృషిచేయాలని ట్రంప్‌ తన మిత్రదేశాలైన జోర్డాన్‌, ఈజి్‌ప్టపై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘పాలస్తీనియన్లకు ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి కొంచం దూరంలో సురక్షితమైన ఆవాసాలను నిర్మిస్తాం.


ఈలోగా ఈ ప్రాంతాన్ని నేను తీసుకుంటాను. భవిష్యత్తులో దీన్నొక రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుగా చూడండి. ఇది చాలా అందమైన ప్రదేశం. పెద్దగా సొమ్ము కూడా అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాలస్తీనాను సౌదీ అరేబియాలో ఏర్పాటు చేసుకోవాలంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు తగినంత భూమి సౌదీలో ఉందన్నారు. ‘సౌదీ ప్రజలు సౌదీ అరేబియాలో పాలస్తీనాను ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ చాలా భూమి ఉంది. అక్టోబరు 7 ఘటనల తర్వాత ఇక్కడ పాలస్తీనా ఏర్పాటును మేం అనుమతించం’ అని తేల్చిచెప్పారు. నెతన్యాహూ వ్యాఖ్యలను సౌదీ తీవ్రంగా ఖండించింది.


ఇవి కూడా చదవండి..

Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..

Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!

For More National News and Telugu News..

Updated Date - Feb 11 , 2025 | 05:05 AM