ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: రాజకీయ కారణాల వల్లే నాసా ఆస్ట్రోనాట్‌లు స్పేస్ స్టేషన్‌లో ఇరుక్కుపోయారు: ఎలాన్ మస్క్

ABN, Publish Date - Feb 19 , 2025 | 10:02 PM

సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశల మధ్య వైరానికి గతంలో అంతరిక్షం కూడా వేదికగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, రష్యాలు పోటాపోటీగా అంతరిక్ష ప్రయోగాలు చేశాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి. అయితే, నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమ్మీదకు తీసుకురావడంలో జాప్యం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు (Elon Musk).

S-350 Air Defence System: అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం.. రష్యాకు ఉక్రెయిన్ షాక్


ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వ్యోమగాములు ఇద్దరూ చిక్కుకుపోవడానికి బైడెన్ కారణమని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అన్నారు. ‘‘రాజకీయ కారణాల వల్ల వారు అక్కడ చిక్కుకుపోయారు. ఇది మంచిది కాదు’’ అని మస్క్ అన్నారు. ఆ వెంటనే ట్రంప్ స్పందిస్తూ ‘‘బైడెన్ వాళ్లను అక్కడే వదిలేశారు. పబ్లిసిటీ కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను’’ అన్ని అన్నారు.

ఎనిమిది రోజుల స్పేస్ మిషన్ కోసం సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ గతేడాది స్పేస్ స్టేషన్‌‌కు వెళ్లారు. కానీ వారిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు బోయింగ్ రూపొందించిన స్పేస్ క్యాప్సూల్ ‘స్టార్‌లైనర్‌’లో సాంకేతికలోపాలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. గత 258 రోజులుగా వారు స్పే్స్ స్టేషన్‌లోనే ఉన్నారు.


Trump: భారత్‌కు డబ్బులు ఎందుకివ్వాలి.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్..

వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మస్క్ సారథ్యంలోని స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ గత సెప్టెంబర్‌లోనే స్పేస్ స్టేషన్‌కు చేరుకుంది. కానీ వారి తిరుగు ప్రయాణాన్ని నాసా పలుమార్లు వాయిదా వేసింది. ఇది హాస్యాస్పదమని ఎలాన్ మస్క్ అన్నారు. ‘‘అయితే, అధ్యక్షుడి సూచన మేరకు తాము వ్యోమగాములను వీలైనంత వేగంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము2’ అని మస్క్ అన్నారు. అయితే, కొత్త వ్యోమగాములతో మార్చిలో స్పేస్ స్టేషన్‌కు వేళ్ల స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా వారిని తిరిగి తీసుకురానున్నట్టు నాసా గత డిసెంబర్‌‌లో ప్రకటించింది. అయితే, తాము అంతరిక్షంలో చిక్కుకుపోయినట్టు తాము భావించట్లేదని విలియమ్స్, విల్‌మోర్ ఇద్దరూ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2025 | 10:02 PM