Trump: ట్రంప్ ‘డైట్ కోక్ బటన్’.. తిరిగి వచ్చేసిందిగా
ABN, Publish Date - Jan 21 , 2025 | 01:12 PM
Diet Coke Button: డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓవెల్ కార్యాలయాన్ని రీడెకరేషన్ చేశారు. ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్ విడిచిపెట్టిన విన్ట్సన్ చర్చిల్ ప్రతిమ, డైట్ కోక్ బటన్‌ను పునరుద్ధరించారు. మొదటి టర్మ్‌లో ట్రంప్ ఉపయోగించిన చాలా వస్తువులను తిరిగి తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది డైట్ కోక్ బటన్.
వాషింగ్టన్, జనవరి 21: అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (America President Donald Trump) ప్రమాణస్వీకారం చేశారు. దీంతో రెండో సారి అధికారికంగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడిగా చేసిన సమయంలో ట్రంప్‌కు కొన్ని అలవాట్లు ఉండేవి. వాటికి అనుగుణంగానే శ్వేతసౌధంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ తరువాత అమెరికా అధ్యక్షడిగా బైడెన్ వచ్చిన తర్వాత ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వస్తువులను పక్కన పెట్టేశారు. వాటిలో ముఖ్యమైనది ట్రంప్‌కు ఎంతో ఇష్టమైన డైట్ కోక్ బటన్ (Diet Coke Button). తిరిగి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వైట్ హౌస్‌లోకి వచ్చిన వెంటనే డైట్ కోక్ బటన్ తిరిగి యధాస్థితిలోకి వచ్చి చేరింది. ట్రంప్ ఆదేశాల మేరకు ముందుగానే డైట్ కోక్ బటన్‌ను అధ్యక్షుడి ఛాంబర్‌లో ఏర్పాటు చేశారు సిబ్బంది. అలాగే విన్ట్సట్ చర్చిల్ ప్రతిమను కూడా చేర్చారు. ఇంతకీ డైట్ కోక్ బటన్ ఏంటి.. దీని ప్రత్యేక ఏంటో ఇప్పుడు చూద్దాం.
డోనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓవెల్ కార్యాలయాన్ని రీడెకరేషన్ చేశారు. ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ట్రంప్ విడిచిపెట్టిన విన్ట్సన్ చర్చిల్ ప్రతిమ, డైట్ కోక్ బటన్‌ను పునరుద్ధరించారు. మొదటి టర్మ్‌లో ట్రంప్ ఉపయోగించిన చాలా వస్తువులను తిరిగి తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనది డైట్ కోక్ బటన్. డైట్ కోక్ ఐస్‌గ్లాస్‌తో ఉన్న బట్లర్‌ను పిలిపించేందుకు ట్రంప్ ఈ బటన్‌ను ఉపయోగిస్తారు. ట్రంప్‌కు డైట్ కోక్ అంటే అమితమైన ఇష్టం. రోజుకు పది పన్నెండు గ్లాసులను అలవకోగా తాగేస్తారంటే ఆయనకు అది అంటే ఎంత ఇష్టమో చెప్పుకోవచ్చు.
AP News: సమాధానం చెప్పండి.. ఆ డీఆర్‌వోకు కలెక్టర్ నోటీసులు
తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు తన టేబుల్ వద్ద ట్రంప్ ఈ బటన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తనకు డైట్ కోక్ తాగాలనిపించినప్పుడు ఈ బటన్‌ను నొక్కిన వెంటనే వ్యక్తిగత సిబ్బంది వచ్చి ఆయనకు డైట్‌కోక్‌ను ఇచ్చి వెళ్తుంటారు. ప్రతీసారి సిబ్బందిని పిలిచి అడగకుండా ఈ బటన్ నొక్కితే చాలు వెంటనే సిబ్బంది వచ్చి ఆయన డైట్ కోక్‌ను అందిస్తారు. డైట్ కోక్ బటన్ నొక్కిన వెంటనే వ్యక్తిగత సిబ్బంది ఉండే గదిలో సైరెన్ మోగుతుంది. దీంతో వెంటనే వారు అలర్ట్ అయి ట్రంప్‌కు కోక్‌ను అందజేస్తారు. అయితే 2021లో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఓవెల్ ఆఫీసులో అడుగుపెట్టిన వెంటనే ఈ బటన్‌ను తొలగించారు. తిరిగి ఇప్పుడు ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో తిరిగి డైట్ కోక్ బటన్ ఆయన టేబుల్‌పైకి వచ్చి చేరింది.
ఇవి కూడా చదవండి...
మీటింగ్‌లో రమ్మీ ఆడిన డీఆర్‌వో.. కలెక్టర్ రియాక్షన్ ఇదీ
చలికాలంలో ఇంత కంటే బెస్ట్ ట్రిక్ ఉండదేమో..
Read Latest International News And Telugu News
Updated Date - Jan 21 , 2025 | 02:25 PM