ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

ABN, Publish Date - Mar 02 , 2025 | 06:31 PM

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పుగా కొరియన్ బాంబూ సాల్ట్‌కు పేరుంది. దీని ఖరీదు కిలో రూ.30 వేలు. మరి దీని విశేషాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Korean Bamboo Salt worlds Most Expensive Salt

ఇంటర్నెట్ డెస్క్: మనకు ఉప్పు అంటే ముందుగా గుర్తొచ్చే సాధారణ ఉప్పే. తెల్లగా ఉండే ఈ ఉప్పును సముద్రపు నీటి నుంచి వెలికి తీస్తారన్న విషయం కూడా చాలా మందికి తెలుసు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న వారు సైంధవ లవణాన్ని వాడుతుంటారు. దీనితో అనేక సోడియంతో పాటు ఇతర అనేక ఖనిజ లవణాలు ఉంటాయి. అయితే, సాధారణంగా ఇంట్లో వాడే ఉప్పు ధర కిలోకు రూ.20కి మించి ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉప్పు ధర మాత్రం కిలో ఏకంగా రూ.30 వేలు (Korean Bamboo Salt).


Recurring Headache Causes: తరచూ తలనొప్పి వేధిస్తోందా.. ఏం కాదులే అనుకుంటే రిస్క్‌లో పడ్డట్టే..

కొరియన్ బాంటూ సాల్ట్ అనే ఉప్పుకు ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా పేరు ఉంది. మార్కెట్లో అన్ని రకాల ఉప్పులకంటే ఇదే మెరుగైనదని కూడా నిపుణులు చెబుతుంటారు. సాధారణ ఉప్పు నుంచే దీన్ని ప్రత్యేక విధానంలో తయారు చేస్తారు. అంతర్జాతీయంగా ఈ ఉప్పు ధర కిలోకు సుమారు 347 డాలర్లు చెల్లించాలి. దీని తయారీకి సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండటం, అధిక సమయం పట్టడమే ఇందుకు కారణం. మీడియా కథనాల ప్రకారం, దీన్ని తయారు చేసేందుకు కనీసం 50 నుంచి 60 రోజులు పడుతుంది.


రోజూ వాకింగ్ చేసేవారు తెలుసుకోవాల్సిన 2:2:1 ఫార్ములా

కొరియా దేశస్థులు ఎన్నో తరాలుగా ఈ ఉప్పును వాడుతున్నారు. ఇందులో ఔషధ గుణాలు బోలెడన్ని ఉన్నాయి. దీన్ని తయారు చేసేందుకు ముందు సముద్రపు ఉప్పును వెదురు గొట్టాల్లో నింపుతారు. ా తరువాత వెదురు మొత్తాన్ని మట్టితో కప్పి చక్కెల మంటపై వేడి చేస్తారు. దాదాపు 800 నుంచి 1500 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేసి ఆ తరువాత చల్లారబెడతారు. ఈ ప్రక్రియను మొత్తం తొమ్మిది చేస్తారు. ఇంతటి వేడి కారణంగా ఉప్పు ద్రవ రూపంలో మారుతుంది. వెదురులోని ఖనిజ లవణాలన్నీ ఇందులో కలిసి పోతాయి. కొరియన్ బాంబూ సాల్ట్‌లో ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక లవణాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో, ఈ ఉప్పుతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ట్రెడ్‌మిల్‌పై నడక కంటే బయట వాకింగ్ చేయడమే బెటరా.. ?

Read Latest and Health News

Updated Date - Mar 02 , 2025 | 06:42 PM