ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: మీరు అతిగా నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు రావడం పక్కా..

ABN, Publish Date - Jan 04 , 2025 | 01:39 PM

ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు కనీసం 7-9 గంటలపాటు మంచి నిద్రను పొందాలి. కానీ కొంతమంది రోజంతా నిద్రపోతుంటారు. అయితే, ఆరోగ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Over Sleeping

Over Sleeping: శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ఒక వ్యక్తి రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. శరీరానికి సరైన నిద్ర లేకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు. శరీరం మొత్తం తిమ్మిరిగా అనిపిస్తుంది. ఏ పనీ చేయడానికి ఆసక్తి ఉండదు. కాబట్టి మానసిక దృఢత్వానికి , ఆనందానికి నిద్ర చాలా ముఖ్యం. అయితే, ఇటీవల కాలంలో కొంత మంది తక్కువగా నిద్రపోతున్నారు. మరికొందరు ఎక్కువగా నిద్రపోతున్నారు. ఇంకొంత మంది రాత్రి పగలు అనే తేడా లేకుండా రోజంతా నిద్రపోతుంటారు. నిజానికి అలా అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 10 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు 5 రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..


ఊబకాయం:

సాధారణంగా అతిగా తినడం వల్ల స్థూలకాయం వస్తుంది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వ పెరుగుతుంది. దీనివల్ల ఊబకాయం సమస్య వస్తుంది. అయితే, అతిగా నిద్రపోవడం వల్ల కూడా ఊబకాయం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరగడం:

మీరు ఎక్కువగా నిద్రపోతున్నట్లయితే, మీ శరీరం చురుకుగా ఉండదు. రాత్రి పడుకున్న వెంటనే నిద్ర రాదు. ఇది మంచి నాణ్యమైన నిద్రను పొందడం కష్టతరం చేస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు.

హార్మోన్ల అసమతుల్యత:

దీర్ఘకాలిక నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. అతిగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీని ప్రభావం వల్ల స్పెర్మ్ సెల్స్, అండాశయాల నాణ్యత దెబ్బతింటుంది. అలాగే సంతానోత్పత్తి రేటు పెరుగుతుంది.

జీర్ణక్రియ సమస్య:

ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసేందుకు మంచి ఆహారం తీసుకోవాలి.

గుండె జబ్బులు:

అధిక నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక నిద్ర శారీరక శ్రమను తగ్గించి శరీరంలో కేలరీలను నిల్వ చేస్తుంది. తర్వాత ఇవి కొలెస్ట్రాల్‌గా మారి రక్తనాళాలు మూసుకుపోతాయి. దీని వల్ల గుండెకు రక్త సరఫరా సులువుగా జరగక గుండెపోటు, పక్షవాతం వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అతిగా నిద్రపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 36 శాతం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

డిప్రెషన్:

అధిక నిద్ర మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. డిప్రెషన్ కారణంగా 15 శాతం మంది పిల్లలు ఎక్కువగా నిద్రపోతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, మీ పిల్లలు నిద్రపోయే సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేయండి.

(Note: ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)

Updated Date - Jan 04 , 2025 | 01:49 PM