Protecting Eyes from Pollution: కాలుష్యం నుంచి కంటిని కాపాడుకోవాలా.. ఇలా చేయండి
ABN, Publish Date - Mar 02 , 2025 | 09:33 PM
వాయు కాలుష్యం నుంచి కళ్ల ఆరోగ్యానికి కాపాడుకునేందుకు వైద్యులు పలు పద్ధతులు సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం కాలుష్యం అంతటా వ్యాపించింది. కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. మరి ఇలాంటి సందర్భాల్లో బయటకు వెళ్లే వారు కళ్ల ఆరోగ్యం కాపాడుకునేందుకు ఏం చేయాలో ఈ కథనంలో చూద్దాం (Protecting Eyes from Pollution).
బయటకు వెళ్లినప్పుడు కళ్లకు రక్షణగా అద్దాలను ధరించాలి. దీంతో, దుమ్ముధూళితో పాటు సూర్యరశ్మి లోని హానికారక యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. యూవీ కాంతి కారణంగా కళ్లకు ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరుగుతుంది. ఇది చివరకు కాటరాక్ట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
బయట ప్రదేశాల్లో ఉన్నప్పుడు కంట్లో దురదగా అనిపిస్తే వెంటనే కళ్లను నలుముకోవద్దు. దీని వల్ల ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, కంటిలో ఇబ్బంది అలాగే కొనసాగుతున్నట్టు ఉంటే వెంటనే వైద్యులను కలవడం మంచిది.
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా
కంటి పరిశుభ్రత నియమాలను తూచా తప్పకుండా పాటించాలి. కంటిని స్టెరైల్ వైఫ్స్‌తోనే తుడుచుకోవాలి. కంట్లో పడ్డ దుమ్మూధుళిని వదిలించుకునేందుకు అప్పుడప్పుడూ కళ్లను నీటితో శుభ్రపరుచుకోవచ్చు.
కంటిలో తేమ ఆరిపోకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ టియర్‌ను వాడొచచు. దీంతో, కంటి ఇరిటేషన్ దరిచేరదు.
ఇంట్లో ఉన్నంత మాత్రాన వాయుకాలుష్యం బారిన పడమని అనుకుంటే పొరపడ్డట్టే. కాబట్టి ఇంట్లో మంచి నాణ్యత కలిగిన ఎయిర్ ప్యూరిఫయ్యర్స్ వాడితే మంచిది. ఇంట్లో ఆలోవీరా వంటి మొక్కలను పెంచితే కొంత వరకూ కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది.
Recurring Headache Causes: తరచూ తలనొప్పి వేధిస్తోందా.. ఏం కాదులే అనుకుంటే రిస్క్‌లో పడ్డట్టే..
ఇక వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. దీంతో, కంటిపై ప్రభావం తగ్గుతుంది.
రోజూ తగినంత నీరు తాగడం కూడా కంటి ఆరోగ్యానికి కీలకం. డీహైడ్రేషన్ కారణంగా అప్పటికే ఉన్న కంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఇక కంట్లో ఎటువంటి ఇబ్బంది అనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను ఎంత త్వరగా సంప్రదిస్తే సమస్య ముదరకుండా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తే వాయుకాలుష్యం నుంచి కళ్లను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమస్యను తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే అధిక శాతం సమస్యలు సులువుగానే సమసిపోతాయని చెబుతున్నారు.
ట్రెడ్‌మిల్‌పై నడక కంటే బయట వాకింగ్ చేయడమే బెటరా.. ?
Updated Date - Mar 02 , 2025 | 09:33 PM