ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Walking 221 Formula: రోజూ వాకింగ్ చేసేవారు తెలుసుకోవాల్సిన 2:2:1 ఫార్ములా

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:47 PM

వాకింగ్ అంటే బోర్ కొడుతోందా? ఈ చిన్న మార్పుతో నూతన ఉత్సాహం.. రెండింతలయ్యే బెనిఫిట్స్. మరి ఈ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం పదండి

ఇంటర్నెట్ డెస్క్: లైఫంతా ఫిట్‌గా ఉండేందుకు వాకింగ్‌కు మించిన కసరత్తు లేదు. అయితే, రోజూ చేసే ఈ వాకింగ్‌కు చిన్న మార్పులు చేస్తే ఫలితాలు ఇనుమడిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నడిచేటప్పుడు 2:2:1 ఫార్ములాను వినియోగిస్తే అద్భుతాలు పక్కా అని చెబుతున్నారు(Walking 2:2:1 Formula).

ఏమిటీ 2:2:1 ఫార్ములా

ఒకే వేగంతో నడవకుండా చిన్న మార్పు చేయడమే ఈ ఫార్ములా ప్రధాన ఉద్దేశం. దీని ప్రకారం, మొదట రెండు నిమిషాల పాటు వేగంగా నడవాలి. ఆ తరువాత రెండు నిమిషాలు జాగింగ్ చేయాలి. చివరిగా ఒక నిమిషం నడవాలి. ఇలా వీలైనంత వరకూ నడక కొనసాగిస్తే అద్భుతాలు జరుగుతాయట.


ట్రెడ్‌మిల్‌పై నడక కంటే బయట వాకింగ్ చేయడమే బెటరా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

ఈ ఫార్ములాతో కలిగే ప్రయోజనాలు

దేహానికి తేలిక పాటి, ఓ మోస్తరు, తీవ్రమైన కసరత్తులు అందించేందుకు ఈ ఫార్ములాను డిజైన్ చేశారట. దీంతో, జీవక్రియలు వేగవంతమై కొవ్వు మరింతగా కరుగుతుందట.

వేగంగా నడవడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరం కసరత్తుకు అనుగూణంగా సిద్ధమవుతుంది. జాగింగ్ కారణంగా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఆ తరువాత మెల్లగా నడిచే సమయంలో కండరాలు క్రమంగా కోలుకుంటాయి. మరో రౌండ్‌కు సిద్ధమవుతాయి. ఈ ఫార్ములాకు శరీరం అంత ఈజీగా అలవాటు పడదని, ఫలితంగా బరువు తగ్గించుకునేందుకు, ఫిట్‌నెస్ పెంచుకునేందుకు అత్యంత ఉపయుక్తమైన ఫార్ములా ఇదేనని చెబుతున్నారు.


Glaucoma: ఒత్తిడితో కూడా గ్లకోమా ముప్పు! కొత్త అధ్యయనంలో వెల్లడి

ఒకే తరహా కసరత్తుల కంటే వివిధ రకాల కసరత్తులను జోడించడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. కాబట్టి, బరువు తగ్గడమే మీ లక్ష్యమైతే ఇంతకు మించిన కసరత్తు మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఈ తరహా వాకింగ్‌తో గుండె ఆరోగ్యం మెరగవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. తరచూ ఈ కసరత్తు చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సైక్లింగ్, రన్నింగ్ వంటి తీవ్రస్థాయి కసరత్తులు అవసరం లేకుండానే ఈ ఫార్ములాతో గుండె పనితీరును మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములాతో వాకింగ్ బోర్ కొట్టకుండా ఉంటుందని, ఫిలంగా ఎగవేతలు లేకుండా రోజూ వాకింగ్ చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములాను రోజు 20 నుంచి 30 నిమిషాలు ఫాలో అయితే ఆరోగ్యం సొంతమవుతుందని భరోసా ఇస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Feb 28 , 2025 | 03:51 PM