ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sleeping pills: స్లీపింగ్ పిల్స్ వెంటనే మానేయండి.. లేదంటే జరిగేది ఇదే..

ABN, Publish Date - Jan 20 , 2025 | 01:27 PM

మీరు నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sleeping Pills

Sleeping Pills Side Effects: చాలా మంది రాత్రి సమయంలో నిద్ర పట్టక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోతే ఇక చేసేదేమీ లేక నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంటారు. అయితే, నిద్ర మాత్రలు వేసుకునే వారు దాని నుండి అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్లీపింగ్ పిల్స్ రకాలు ఉంటాయని, వాటిని వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు. అయితే, అసలు స్లీపింగ్ పిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిని ఎందుకు వేసుకోకూడదు? వేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

స్లీపింగ్ పిల్స్ రకాలు

1.బెంజోడియాజిపైన్: ఈ మాత్రలు తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. త్వరగా నిద్రను ప్రేరేపిస్తాయి. అయితే, వీటిని ఎక్కువ కాలం ఉపయోగించడం ప్రమాదకరం.

2.నాన్ బెంజోడియాజిపైన్: నాన్ బెంజోడియాజిపైన్ మాత్రలు బెంజోడియాజిపైన్ కంటే తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి.

3.హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటీగోనిస్ట్‌లు: ఈ మాత్రలు నేరుగా నిద్రను ప్రేరేపించవు. కానీ, నిద్రను ప్రేరేపించడంలో ఇవి సహాయపడతాయి. బెంజోడియాజిపైన్, నాన్ బెంజోడియాజిపైన్ మాత్రల కంటే ఇవి తక్కువ హానికరం.


స్లీపింగ్ పిల్స్ సైడ్ ఎఫెక్ట్స్:

  • నిద్ర మాత్రలు వేసుకునే వారికి సాధారణ నిద్ర రాకపోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు మీకు రాత్రి అకస్మాత్తుగా మెలుకువ రావచ్చు.

  • స్లీపింగ్ పిల్స్ నిద్రను కలిగించడానికి తయారు చేస్తారు. అయితే వైద్యులను సంప్రదించకుండా తీసుకుంటే అధిక నిద్ర సమస్య తలెత్తవచ్చు.

  • నిద్రమాత్రలు ఎక్కువసేపు వాడటం వల్ల మెదడుకు హాని కలుగుతుంది. దీనివల్ల చిరాకు, కోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు.

  • అధిక నిద్ర మాత్రలు కూడా మీకు నిద్రను కోల్పోయేలా చేస్తాయి. రాత్రంతా మేల్కొనేలా చేస్తాయి.

డాక్టర్ సలహా

మీరు డాక్టర్ సలహా లేకుండా నిద్ర మాత్రలు తీసుకుంటే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇది కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా, రెండు అవయవాలు విఫలం కావచ్చు లేదా దెబ్బతింటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 20 , 2025 | 02:07 PM