ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా.. వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి..

ABN, Publish Date - Jan 22 , 2025 | 12:52 PM

పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా? హార్మోన్ సంబంధిత సమస్యను నియంత్రించడానికి, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. వీటిని మీ ఆహారంలో చేర్చుకోని మీ సమస్యను దూరం చేసుకోండి..

PCOS

PCOS: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్యతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో ఈ వ్యాధి వస్తుంది. స్త్రీలలో నెలసరి సరిగా రాకపోవడం, సంతానలేమితో బాధపడటం, అధిక బరువు ఉండటం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు వంటి పలు సమస్యలు వస్తాయి. కాబట్టి, పీసీఓఎస్ సమస్యను ఎంత త్వరగా నయం చేసుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎలాంటి ఆహారం తీసుకుంటే PCOS సమస్య దూరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గుమ్మడికాయ:

గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయలోని విటమిన్ ఎ, సి హార్మోన్ల సమతుల్యతకు అవసరం.

బ్రోకలీ:

బ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు, ఇది అనేక రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను సులభతరం చేస్తుంది.


టమాటో:

టమాటోలో విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది అండాశయాలలో మంటను తగ్గిస్తుంది, తద్వారా PCOS లక్షణాలను నియంత్రిస్తుంది.

నిమ్మకాయ:

మీరు PCOSతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోండి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ.. విటమిన్ సి లోపాన్ని నివారించడంతో పాటు రక్తంలో చక్కెర పెరగకుండా చేస్తుంది.

ఆవపిండి:

ఆవపిండిలో విటమిన్ సితో పాటు పీచు, కాల్షియం, విటమిన్ ఎ వంటి పోషకాలు ఉంటాయి. దీని వినియోగం హార్మోన్ల సమతుల్యతలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు, చలి రోజుల్లో దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read: బెండకాయలో జిగురు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

Updated Date - Jan 22 , 2025 | 12:53 PM