ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Eggs: కోడిగుడ్లపై ఈ అపోహలు వద్దు..

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:23 PM

కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. చాలా పోషకాలు అందుతాయి. అయితే, కొందరిలో గుడ్ల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి నిజాలు ఇక్కడ తెలుసుకుందాం..

Eggs

Eggs: కోడిగుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు పుషల్కంగా ఉంటాయి. అందుకే పిల్లల నుండి వృద్దుల వరకు గుడ్డును ఇష్టంగా తింటారు. ప్రతి రోజూ ఒక గుడ్డు తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు సమయం లేకపోతే ఎంచక్కా ఆమ్లెట్ వేసుకొని తినేయచ్చు. గుడ్లు వండటానికి సులువుగా, తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు దక్కుతాయి. చాలా పోషకాలు అందుతాయి. అయితే, కొందరిలో గుడ్ల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి నిజాలు ఇక్కడ తెలుసుకుందాం..

కోడిగుడ్లపై ఈ అపోహలు వద్దు..

  • తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగులో ఉండే గుడ్లు ఆరోగ్యానికి మంచివని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. రెండు రకాల గుడ్లలో సమానమైన పోషకాలు ఉంటాయి.

  • గుడ్డు సొన తింటే బరువు పెరుగుతారని కొందరు అనుకుంటారు. అయితే, ఎగ్ లోని వైట్ కంటే సొనలోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. విటమిన్ ఏ, డీ, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు సోనలో ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది.

  • ప్రతీ రోజు గడ్లు తినడం మంచిది కాదని కొందరు అనుకుంటారు. అయితే, ఈ వాదనలో నిజం లేదు. హై క్వాలిటీ ప్రొటీన్లు,అవసరమైన విటమిన్లు , మినరల్స్ గుడ్లలో ఉంటాయి. అందుకే ప్రతీ రోజు గుడ్లు తినొచ్చు.


  • కోడిగుడ్లను ఉడకబెట్టే ముందు తప్పక కడగాలని, అలా అయితే సాల్మోనెల్లా పోతుందని కొందరు నమ్ముతుంటారు. అది వాస్తవం కాదు. గుడ్లను కడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడిగితే గుడ్ల పొట్టపై ఉండే నేచురల్ ప్రొటెక్టివ్ కోటింగ్ పోతుంది.

  • వేసవి కాలంలో కోడిగుడ్లను తినకూడదని కొందరిలో అపోహ ఉంటుంది. అయితే, గుడ్లుల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి వీటిని ఏ కాలంలోనైనా తినొచ్చ.

  • గుడ్లు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా పెరుగుతుందని కొందరు అనుకుంటారు. అయితే, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవళ్లపై గుడ్ల ప్రభావం చాలా తక్కువని చాలా అధ్యయనాలు తేల్చాయి.

  • (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 19 , 2025 | 01:23 PM