ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tooth pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా? వీటిని ట్రై చేస్తే తక్షణ రిలీఫ్!

ABN, Publish Date - Jan 27 , 2025 | 01:17 PM

పంటి నొప్పికి లవంగాలతో చక్కని పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని యాంటీమైక్రోబియల్, అనెస్థిటిక్ గుణాలు నొప్పి నుంచి త్వరిత గతిన విముక్తి కల్పిస్తాయని చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పంటి నొప్పి.. సమస్య చిన్నదే అయినా బాధ మాత్రం వర్ణనాతీయం. పంటి నొప్పి మొదలు కాగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడతారు. లేదా డెంటిస్ట్ వద్దకు వెళతారు. ఇది మంచిదే అయినా సాధారణ నొప్పికి వంటింట్లోనే చక్కని పరిష్కారం లవంగాలు అని వైద్యులు చెబుతున్నారు (Cloves remedy for Tooth ache).

నిపుణులు చెప్పే దాని ప్రకారం, లవంగాలు పంటి నొప్పికి సహజసిద్ధమైన పరిష్కారం. నొప్పి తగ్గించడంతో పాటు ఇతరత్రా సమస్యలన్నీ తొలగిస్తుంది. వీటిలోని యాంటీమైక్రోబియల్ గుణం నోట్లో హానికారక క్రిములను నశింప జేస్తుంది. లవంగాలు నమిలినా, లేక లవంగం నూనె వాడినా మంచి ఫలితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు (Health).


Heart Attack: అలర్ట్.. ఈ 5 రకాల నొప్పులు ఉంటే గుండె పోటు వచ్చే ఛాన్స్!

లవంగాల ప్రత్యేకతలు ఇవే!

లవంగం మొక్క ఆగ్నేయాసియా దేశాల్లో విరిగా లభిస్తుంది. ఇందులో ఔషధ గుణాలున్న అనేక రసాయనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లోని యూజీనాల్‌ పంటి నొప్పికి చక్కని పరిష్కారం. యూజీనాల్‌ సహజసిద్ధమైన అనెస్థిటిక్‌గా పనిచేస్తుంది. నొప్పి తెలీకుండా చేస్తుంది. దీంతో, పాటు లవంగాల్లోని యాంటీబ్యాక్టీరియల్ గుణం నొప్పికి కారణమవుతున్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా లవంగం నమిలినా, ఈ నూనె తీసుకున్నా నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పంటి సంబంధిత సమస్యలు ఉన్న వారిలో ఇన్‌ఫ్లమేషన్, నొప్పిని యూజీనాల్‌తో గణనీయంగా తగ్గినట్టు అనేక అధ్యనాల్లో రుజువైంది. పంటి సమస్యలకు ప్రధాన కారణమైన స్ట్రెప్టోకొక్కస్ మ్యూటాన్స్‌ను యూజీనాల్ సులువుగా అంతమొందిస్తుంది.


Health: ఆహారం తిన్న తరువాత నీరసంగా అనిపిస్తోందంటే ఈ లోపం ఉన్నట్టే!

పంటి నొప్పికి ప్రధాన కారణాల్లో గమ్ ఇన్‌ఫ్లమేషన్ కూడా ఒక కారణం. అయితే, లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేషన్ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో, లవంగాలు క్రమం తప్పకుండా వాడేవారికి పంటి నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. నోటి దుర్వాసన కూడా పోయి శ్వాస నిత్యం తాజాగా ఉంటుంది.

లవంగాలతో సాధారణంగా ఎటువంటి అపాయం ఉండదు. అయితే, ఏదైనా సరే హద్దు దాటనీయకూడదనేది అనుభవజ్ఞులు చెప్పే మాట. ఈ సూత్రం లవంగాలకూ వర్తిస్తుంది. కాబట్టి, వీటిని తొలుత కొద్ది మొత్తంలో వినియోగించి ఫలితం ఉందనుకుంటే ముందుకు వెళ్లాలి. లవంగాలు వాడినా ఫలితం లేదనుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆధునిక వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని కూడా గుర్తించాలి.

Read Latest and Health News

Updated Date - Jan 27 , 2025 | 01:20 PM