Heart Attack: అలర్ట్.. ఈ 5 రకాల నొప్పులు ఉంటే గుండె పోటు వచ్చే ఛాన్స్!
ABN , Publish Date - Jan 27 , 2025 | 07:40 AM
గుండె పోటు వచ్చే ముందు శరీరంలో కొన్ని నొప్పులు మొదలవుతాయి. ఇవి గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు
ఇంటర్నెట్ డెస్క్: గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరికి గుండెపోటుకు ముందు ఛాతిలో బాగా నొప్పి అనిపిస్తుంది. మరికొందరిలో ఎటువంటి మార్పు లేకుండానే గుండె పోటు బారిన పడతారు. వాస్తవానికి అన్ని శారీరక నొప్పులు గుండె పోటుకు సంకేతాలు కాకపోయినప్పటికీ కొన్ని రకాల నొప్పులు వస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే అవకాశాన్ని గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదిస్తే సమస్య ముదరకుండానే పరిష్కరించుకోవచ్చు. ఇక గుండె పోటుకు ముందు సాధారణంగా కనిపించే లక్షణాలు ఏవంటే (body pains that indicate a heart attack)..
ఛాతిలో నొప్పి: గుండె పోటుకు ముందు చాలా మందిలో సాధారణంగా కనిపించే నొప్పి ఇది. కొందరికి కేవలం ఛాతిలో అసౌకర్యంగా మాత్రమే అనిపించొచ్చు. ఛాతిపై ఒత్తిడి పెరిగినట్టు ఉండటం, బరువుగా అనిపించడం లేదా ఛాతిని ఎవరో పిండేస్తున్నట్టు అనిపించడం వంటివన్నీ గుండెపోటుకు లక్షణాలు (Health).
Health: ఆహారం తిన్న తరువాత నీరసంగా అనిపిస్తోందంటే ఈ లోపం ఉన్నట్టే!
చేయి నొప్పి. చేతుల్లో నొప్పి అనిపించడం లేదా అసౌకర్యంగా ఉండటం వంటివి కూడా గుండెపోటుకు ఓ సంకేతం. గుండెపోటు వచ్చే ముందు ఛాతి నుంచి ఎడమ చేతి వైపు నొప్పి ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరికి భుజాలు, వీపులో కూడా నొప్పి అనిపిస్తుంది.
గుండెపోటు వచ్చే ముందు కొందరిలో గొంతు లేదా దవడలో నొప్పిగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు లేదా కసరత్తు చేస్తున్నప్పుడు ఈ నొప్పి మొదలవుతుంది. పంటినొప్పి, ఊపిరాడనట్టు ఉండటం, మెడపై ఒత్తిడి పెరగడం వంటి వన్నీ గుండె పోటుకు ముందు కనిపించే సంకేతాలు.
Health: రాత్రి ఇలా నిద్రిస్తే ముఖంపై శాశ్వతంగా ముడతలు!
ఉదరం పైభాగంలో కనిపించే నొప్పి కూడా గుండెపోటుకు ఓ సంకేతమని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి కడుపు పైభాగంలో పట్టేసినట్టు అనిపిస్తుంది. వాంతులు కూడా రావచ్చు.
ఇక 10 శాతం కేసుల్లో ఎటువంటి నొప్పి లేదా ముందస్తు సంకేతం లేకుండానే గుండెపోటు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీన్ని సైలెంట్ మయోకార్డియల్ ఇషేమియా అని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు, వృద్ధుల్లో ఇలా జరుగుతుందట.
కాబట్టి, ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే సమస్య ముదరక ముందే పరిష్కరించుకోవచ్చు. ఈసీజీ, ఎకో, బ్లడ్ టైటర్స్ పరీక్షలతో గుండె పోటును సులువుగా గుర్తించొచ్చు. గుండెపోటు సందర్భంగా గుండె కండరం దెబ్బతింటుంది కాబట్టి ఎంత వేగంగా డాక్టర్ వద్దకు వెళితే నష్టాన్ని అంతగా పరిమితం చేయొచ్చన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.