Health: రాత్రి ఇలా నిద్రిస్తే ముఖంపై శాశ్వతంగా ముడతలు!
ABN , Publish Date - Jan 25 , 2025 | 09:04 PM
రాత్రి ఏ పొజిషన్‌లో నిద్రిస్తున్నామనే అంశం చర్మ ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు భంగిమలో నిద్రిస్తే ముఖంపై ఒత్తిడి పెరిగి శాశ్వతంగా ముడతలు వస్తాయని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: చర్మం ముడతలు పడకుండా అనేక మంది రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే, రాత్రి ఎలా పడుకుని నిద్రిస్తున్నామనే అంశం కూడా చర్మంపై ముడతలకు కారణమవుతుందని చాలా మందికి తెలియదు. దీంతో, రాత్రి నిద్రకు సంబంధించి అవే పొరపాట్లు పదే పదే చేసి ముఖంపై శాశ్వతంగా ముడతలు వచ్చేలా చేసుకుంటారు. మరి ఈ నిద్రవల్ల కలిగే ముడతలు దరిచేరకుండా ఉండేందుకు ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం (Sleep Wrinkles).
డెర్మటాలజిస్టులు చెప్పే దాని ప్రకారం, రాత్రిళ్లు తప్పు పొజిషన్‌లో పడుకోవడం వల్ల ముఖంపై ఈ ముడతలు ఏర్పడతాయి. బుగ్గలు, నుదురు, కంటి చుట్టూ ఇవి వస్తాయి. తొలుత తాత్కాలికంగా ఏర్పడే ఈ మచ్చలు తప్పును సరిదిద్దుకోక పోతే చివరకు ముకంపై శాశ్వతంగా నిలిచిపోతాయి (Health).
Carbonated Water: సోడాతో ఇలాంటి ఉపయోగాలు కూడా ఉన్నాయా? ఆసక్తి రేపుతున్న అధ్యయనం!
చాలా మందికి ఓవైపు తిరిగి నిద్రించడం ఇష్టం. ఇలా రోజూ చేసవా వారి బుగ్గలపై దిండు తాలుకు ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇది ముడతలకు దారి తీస్తుంది. చివరకు ముఖంపై ఓ వైపును వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనబడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇక కొందరు బోర్లా పడుకుని నిద్రపోయేందుకు ఇష్టపడతారు. ఇది మరింత ఇబ్బందికరమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బుగ్గలతో పాటు నుదుటిపై కూడా ముడతలు ఏర్పడతాయి.
Man leaks Cholesterol: బాబోయ్ ఇదేం వింత వ్యాధి! వ్యక్తి చేతుల్లోంచి లీకైపోతున్న కొలెస్టెరాల్
అయితే వెల్లకిలా పడుకుని నిద్రించడం అత్యంత ఉపయుక్తమైన పొజిషన్ అని వైద్యులు చెబుతున్నారు. దీంతో ముఖంపై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో స్లీప్ రింకిల్స్ రాకుండా ఉండేందుకు ఇది గొప్ప పద్ధతని చెబుతున్నారు.
అయితే, నిద్ర సమయంలో పాటించ వలసిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయి. చర్మంపై ఒత్తిడి తక్కువగా ఉండేందుకు మృదువుగా ఉండే పిల్లో కవర్లను మాత్రమే వాడాలి. వీలైనంత వరకూ వెల్లకిలా మాత్రమే పడుకుని నిద్రించాలి. వీలైతే ఫోమ్‌తో చేసిన దిండ్లనే వాడాలి. ఇక రాత్రిళ్లు తగినంత తీరు తాగాక నిద్రిస్తే చర్మంలో తేమ నిలిచి ఉండి ముడతల బెడద కొంత వరకూ తగ్గుతుంది.