ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: పడుకునే ముందు ఈ పని చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు..

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:30 PM

నిద్రలేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి నెయ్యి మసాజ్ ఎంతగానో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మర్దనా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

నెయ్యి అనేక ప్రయోజనాలను కలిగించే ప్రాకృతిక ఉత్పత్తి. నెయ్యి వల్ల పొందే లాభాలు అనేకం. పాదాలకు, చర్మానికి, జుట్టుకు ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో పడుకునే ముందు పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి.

మలబద్దకం:

చలికాలంలో చాలా మంది ఎక్కువగా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు అరికాళ్లను నెయ్యితో రుద్దుతూ మర్దనా చేసుకుంటే మలబద్దకం సమస్య దూరం అవుతుంది.

నొప్పులు :

చాలా మందికి శీతాకాలంలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతాయి. తరచుగా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లైతే నెయ్యిని పాదాలకు రాసుకోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.


ప్రశాంతమైన నిద్ర:

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి నెయ్యి మసాజ్ ఎంతగానో సహాయపడుతుంది. పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల నిద్రలో నొప్పులు తగ్గుతాయి. తద్వారా ప్రశాంతమైన నిద్రను పొందగలుగుతారు.

రక్త ప్రసరణ పెరుగుతుంది:

పాదాలకు నెయ్యి రాసుకోవడం వల్ల రక్తప్రవాహం సక్రమంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. నెయ్యిని అరికాళ్లపై రుద్దడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.

అరికాళ్ల నొప్పులు:

నెయ్యి పాదాలకు రాసుకోవడం వల్ల అరికాళ్ల నొప్పులతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి రోజూ రాత్రి పాదాలకు నెయ్యితో మర్దన చేసుకుంటే అరికాళ్ల మంటకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. పాదాల అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల సగం రోగాల నుంచి తప్పించుకోవచ్చు.

Updated Date - Jan 02 , 2025 | 01:59 PM