Health Tips: గర్భధారణ సమయంలో టీ తాగడం వల్ల గర్భస్రావం అవుతుందా..
ABN, Publish Date - Jan 26 , 2025 | 10:14 AM
గర్భధారణ సమయంలో ఎక్కువ టీ తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని కొంతమంది అంటారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఉదయం నిద్ర లేవగానో టీ తోనే రోజును ప్రారంభిస్తారు. కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతారు. అయితే, గర్భధారణ సమయంలో టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, టీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని..కొన్నిసార్లు గర్భస్రావం అవుతుందని కొంతమంది అంటారు. అయితే, ఇది ఎంతవరకు నిజం.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
వైద్యుల ప్రకారం, గర్భధారణ సమయంలో కెఫీన్ హానికరం. దీని అధిక వినియోగం గర్భస్రావం, పుట్టుక లోపాలు, అకాల డెలివరీ వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు 200 మి.గ్రా కెఫిన్ మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది ఒక కప్పు కాఫీ లేదా రెండు కప్పుల టీతో సమానం.
హెర్బల్ టీని పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు, అయితే అలా చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి సమతుల్య, పోషకమైన ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో మహిళలు అధికంగా కెఫిన్ తీసుకోవడం మానుకోవాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 26 , 2025 | 10:15 AM