Health: ఆహారం తిన్న తరువాత నీరసంగా అనిపిస్తోందంటే ఈ లోపం ఉన్నట్టే!
ABN, Publish Date - Jan 26 , 2025 | 07:43 PM
భోజనం చేశాక తరచూ నీరసంగా అనిపిస్తోందంటే ఆహారంలో పోషకాలు తక్కువైనట్టు భావించాలని వైద్యులు చెబుతున్నారు. పోషకాల లోపానికి ఇదో ముఖ్య సంకేతమని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భోజనం చేశాక మీకు తరచూ నీరసంగా అనిపిస్తోందా? నిస్సత్తువ ఆవరిస్తోందా? ఇలా అనిపిస్తోందంటే మీకు పోస్ట్ మీల్ ఫ్యాటిగ్ ఉన్నట్టేనని వైద్యులు చెబుతున్నారు (Post Meal Fatigue). ముఖ్యంగా ఆహారంలో పోషకాల లోపం ఈ సమస్యకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. తిన్న తరువాత కాస్త నీరసంగా అనిపించడం సహజమేనని వైద్యులు అంటున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసేందుకు శరీరం శక్తి మొత్తాన్ని జీర్ణ వ్యవస్థపై కేంద్రీకృతం చేయడంతో ఇలా అనిపిస్తుందట. అయితే, తరచూ ఇలాంటి భావన కలిగితే మాత్రం సందేహించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు (Health).
నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఆహారం తిన్నాక జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో, తాత్కాలికంగా ఓపిక లేనట్టు అనిపిస్తుంది. ఇక ఆహారం జీర్ణమయ్యే టప్పుడు విడుదలయ్యే సెరటోనిన్ అనే హార్మోన్.. నిద్రను కలుగ జేస్తుంది. అయితే, నిత్యం ఆహారం తిన్నాక నీరసం వేధిస్తోందంటే మాత్రం సందేహించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పోషకాల లోపం లేదా సమతులాహారం తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణం అయ్యే ఛాన్సు ఉందని చెబుతున్నారు.
Health: రాత్రి ఇలా నిద్రిస్తే ముఖంపై శాశ్వతంగా ముడతలు!
ఇటీవల కాలంలో జనాలు తినే ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఆహారాల్లో పోషకాలు ఉండవు. వీటితో ఆకలి తీరినా శరీరానికి కావాల్సిన పోషకాలు లభించవు. ఈ పోషకాల్లో చాలా మటుకు శరీరంలో శక్తి విడుదలకు అవసరం. అవి లేకపోతే నీరసం వెంటాడుతుంది.
కాబట్టి, ఆహారంలో అన్ని పోషకాలు అవసరమైన మేరకు ఉండేందుకు కొన్ని మార్గదర్శకాలు కచ్చితంగా ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులతో పాటు విటమిన్స్, మినరల్స్ కచ్చితంగా ఉండాలి.
ఆహారంలో మంచి కొవ్వులు ఉండటం అవసరం. ఇవి విత్తనాలు, గింజలు, కొబ్బరిలో సమృద్ధిగా ఉంటాయి కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో అస్సలు ఉండవు. ఈ కొవ్వులు హార్మో్న్ ఉత్పత్తికి, న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుకు, మైక్రోన్యూట్రియంట్స్ శరీరం గ్రహించేందుకు కీలకం.
Man leaks Cholesterol: బాబోయ్ ఇదేం వింత వ్యాధి! వ్యక్తి చేతుల్లోంచి లీకైపోతున్న కొలెస్టెరాల్
ఇక శాకాహార, మాంసాహారాల్లో లభించే ప్రోటీన్లు కండరాల రిపేర్‌కు, శక్తి ఉత్పత్తికి కీలకం. కొన్ని అమైనోయాసిడ్స్‌ను శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు కాబట్టి ఇవి కచ్చితంగా ఆహారం ద్వారానే అందాలి.
ఇక విటమిన్ డీ, విటమిన్ బీ, ఐరన్, జింక్, సెలీనియమ్, మెగ్నీషియమ్, ఐయోడిన్ వంటి వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి శక్తి ఉత్పత్తికి అత్యంత కీలకం. ఉదాహరణకు ఐరన్ లోపం ఉన్న వాళ్లో రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఇక విటమిన్ డీ సరిగా లేకపోతే థైరాయిడ్ పనితీరు మందగించి అలసట ఆవరిస్తుంది. కాబట్టి, సమతుల ఆహారం తీసుకునేందుకు మొగ్గు చూపాలని వైద్యులు సూచిస్తున్నారు.
Updated Date - Jan 26 , 2025 | 07:43 PM