ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Water Purifying Tips: ఆర్ఓ ఫిల్టర్ లేని వారు ఈ టిప్స్ పాటిస్తే నీటి కాలుష్యం నుంచి విముక్తి

ABN, Publish Date - Feb 22 , 2025 | 10:09 PM

ఆర్‌ఓ ఫిల్టర్‌ లేని వాళ్లు పాటించాల్సిన ప్రత్యామ్నాయ విధానాలు ఏవంటే..

ఇంటర్నెట్ డెస్క్: మంచి ఆరోగ్యానికి పరిశుభ్రమైన నీరు తాగడం అత్యంత ఆవస్యకం. ఇక రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్లు ఈ పనిని అత్యంత సమర్థవంతంగా పూర్తి చేస్తాయని అందరికీ తెలిసదే. కానీ, ఇవి కాస్త ఖరీదైనవి కావడంతో అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి సందర్భాల్లో పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నీటిని మరిగిస్తే అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మక్రిములు అంతమైపోతాయి. ఈ విధానంతో సూక్ష్మక్రిములు తొలగిపోయినా కూడా హెవీ మెటల్స్, కెమికల్స్ వంటివి మాత్రం అలాగే ఉండిపోతాయి.

Viral: 145 ఏళ్ల నాటి టేబుల్ తొలగింపు.. మస్క్ తనయుడి దెబ్బకు ట్రంప్‌లో గుబులు పుట్టిందా..


ఆర్‌ఓ ఫిల్టర్లు లేని వారు సెరామిక్ లేదా ఛార్‌కోల్ ఫిల్టర్‌లను వాడి మలినాలను తొలగించుకోవచ్చు. సెరామిక్ ఫిల్టర్లలోని సూక్ష్మమైన రంధ్రాలు బ్యాక్టీరియా, ఇతర మలినాలను అడ్డుకుంటాయి. వీటితో వడకట్టిన నీరు పరిశుభ్రంగా ఉంటుంది. ఇవి క్లోరిన్, క్రిమిసంహారకాలు, ఆర్గానిక్ కాంపౌండ్స్‌ను కూడా తొలగిస్తాయి. దీంతో, దుర్గధంపోయి నీటికి రుచి కూడా వస్తుంది. అయితే, వీటితో వైరస్‌, హెవీ మెటల్స్‌ను తొలగించలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

తక్కువ ధరకు సులభంగా నీటిని ఫిల్టర్ చేసే మరో విధానం సోలార్ డిస్‌ఇన్‌ఫెక్షన్. గ్రామీణ ప్రాంతాలు లేదా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయినప్పుడు ఇది మంచి తరుణోపాయం. ఇందులో భాగంగా నీటిని ఓ బాటిల్‌లో పెట్టి కనీసం ఆరు గంటల పాటు ఎండలో ఉంచాలి. ఎండలోని యూవీ కిరణాల కారణంగా నీళ్లల్లోని సూక్ష్మక్రిములన్నీ చనిపోతాయి. నీటిలో మలినాలు ఉన్నప్పుడు చిన్న వస్త్రంతో వడకట్టాక ఎండలో పెట్టాలి.


Viral: విడాకుల తీసుకున్న వెంటనే తోడు కోసం మహిళ ప్రయత్నం! జీవితం తలకిందులు

నీటికి క్లోరిన్ లేదా బ్లీచ్ వేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. లీటర్ నీటికి రెండు నుంచి నాలుగు చుక్కల హౌస్‌హోల్డ్ బ్లీచ్ వేస్తే నీటిలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి. బ్లీచ్‌ను వేశాక కనీసం 30 నిమిషాలు నీటిని అలాగే వదిలేస్తే పూర్తిస్థాయిలో సూక్ష్మక్రిములు తొలగిపోతాయి.

నీటిని శుభ్రపరిచేందుకు డిస్టిల్లేషన్ అత్యంత ప్రభావశీలమైన విధానం. ఇందులో మలినాలు, లవణాలు, సూక్ష్మక్రిములు, హెవీ మెటల్స్ వంటివన్నీ తొలగిపోతాయి. ఈ విధానంలో నీటిని మరిగించి, ఆవిరిని మరో పాత్రలో పట్టుకోవాలి. నీరు ఆవిరిగా మారే క్రమంలో మలినాలన్నీ వెనకే ఉండిపోవడంతో స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. అయితే, ఈ విధానంలో నీటిని ఫిల్టర్ చేసేందుకు కాస్త సమయం పడుతుంది. దీనికి ఇంధన వినియోగం కూడా ఎక్కువే.

Read Latest and Viral News

Updated Date - Feb 22 , 2025 | 10:32 PM