ఈ వారం వివిధ కార్యక్రమాలు 9 03 2025
ABN, Publish Date - Mar 10 , 2025 | 12:57 AM
మునిపల్లె రాజు సాహిత్య పురస్కారాలు, బీసీ వాద కవిత్వానికి ఆహ్వానం, నవలల పోటీకి ఆహ్వానం...
మునిపల్లె రాజు సాహిత్య పురస్కారాలు
కథకుడు మునిపల్లె రాజు శతజయంతి సందర్భంగా 2023 సాహిత్య పురస్కారాన్ని సుధామ, 2024 సాహిత్య పురస్కారాన్ని పి. చంద్రశేఖర ఆజాద్‌లు స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఎం.వి.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 17 సా.6గంటలకు రవీంద్రభారతి, హైదరా బాద్‌లో జరుగుతుంది.
ఉష మునిపల్లె
నవలల పోటీకి ఆహ్వానం
జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో ఏపీయూఎస్ వ్యవస్థాపక కార్యదర్శి స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీ – 2025కు రచనలను ఆహ్వానిస్తున్నాం. పోటీలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా: రూ.25వేలు, రూ.20వేలు. రచనలు చేరాల్సిన చివరి తేదీ ఏప్రిల్ 8. పూర్తి వివరాలకు: www.jagritiweekly.comలో జాగృతి వారపత్రిక తాజా సంచిక చూడండి. ఫోన్: 99599 91304.
జాగృతి సంపాదకులు
బీసీ వాద కవిత్వానికి ఆహ్వానం
బీసీ అస్తిత్వ, సాంస్కృతిక, రాజకీయవాదాన్ని బలపరుస్తూ బీసి కవుల నుండి వచన కవితలకు ఆహ్వానిస్తున్నాము. కవితలను ఏప్రిల్ 15లోగా ఈమెయిల్: bcsahityavedika2025@ gmail.com, వాట్సప్ నెంబర్: 94927 65358కు పంపాలి. బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ జరిగే రాష్ట్ర స్థాయి బీసీ సాహిత్య సదస్సులో సంకలనంగా ప్రచురించి ఆవిష్కరిస్తాము.
వనపట్ల సుబ్బయ్య
ఇవి కూడా చదవండి:
EPFO: కొత్త అప్డేట్ .. EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 10 , 2025 | 12:57 AM