భార్యను సంసారానికి పంపలేదని చిన్నత్తను కత్తితో పొడిచిన యువకుడు
ABN, Publish Date - Feb 06 , 2025 | 11:45 AM
తన భార్యను సంసారానికి పంపించేందుకు నిరాకరించిన పిన్నమ్మను ఓ యువకుడు కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటన తిరువొట్రియూరు, అయ్యాపిళ్ళై గార్డెన్‌లో జరిగింది.
హైదరాబాద్: తన భార్యను సంసారానికి పంపించేందుకు నిరాకరించిన పిన్నమ్మను ఓ యువకుడు కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటన తిరువొట్రియూరు, అయ్యాపిళ్ళై గార్డెన్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అన్బళగన్ కుమార్తె తమిళ్ సెల్విని తిరుపూరు(Tirupuru)కు చెందిన కాళిముత్తు అనే యువకుడికి ఇచ్చి గత యేడాది వివాహం చేశారు. వీరంతా కలిసి చెన్నై(Chennai)లో ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. అయితే, కాళిముత్తుకు తన భార్య ప్రవర్తనపై సందేహించి అనేక షరతులు పెట్టి హింసించసాగాడు. సమస్య పెద్దది కావడంతో కాళిముత్తు తిరుపూరు వెళ్ళిపోయాడు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి గవర్నర్ ఉండాల్సిందే..
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన కాళిముత్తు తన భార్యను సంసారానికి పంపించాలని పట్టుబట్టాడు. దీనికి తమిళ్ సెల్లి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అదే వీధిలో ఉండే తన పిన్ని ధనలక్ష్మి (50) ఇంటికి తమిళ్‌సెల్వి వెళ్ళింది. దీంతో మరింత ఆగ్రహించిన కాళిముత్తు... ఆమె ఇంటికి వెళ్ళి మరోమారు బ్రతిమలాడగా, తమిళ్‌సెల్విని పంపించేందుకు ధనలక్ష్మి నిరాకరించింది. దీంతో ధనలక్ష్మిని కత్తితో పొడిచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న కాళిముత్తు కోసం గాలిస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News
Updated Date - Feb 06 , 2025 | 11:45 AM