రుణం కంటే ఎక్కువ వసూలు చేశారు
ABN, Publish Date - Feb 06 , 2025 | 03:07 AM
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తీసుకున్న రుణాలకంటే బ్యాంకులు ఎక్కువగా వసూలు చేశాయని విజయ్ మాల్యా హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు తమ సంస్థ...
బ్యాంకులపై విజయ్ మాల్యా పిటిషన్
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తీసుకున్న రుణాలకంటే బ్యాంకులు ఎక్కువగా వసూలు చేశాయని విజయ్ మాల్యా హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు తమ సంస్థ రూ.6,200 కోట్లు బకాయి ఉందని, బ్యాంకర్లు అంతకు రెండురెట్లకు మించి వసూలు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. మాల్యాకు చెందిన రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రస్తావించారని పిటిషన్‌లో వివరించారు. ఈ నెల 3న పిటిషన్ దాఖలు కాగా, జస్టిస్ ఆర్ దేవదాస్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మాల్యా తరఫున న్యాయవాది సజన్ పూవయ్య వాదనలు వినిపించారు. రుణాల రికవరీ స్టేట్‌మెంట్ సమర్పించాలని బ్యాంకు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పలు జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు రుణాల వసూలు ప్రక్రియను చేపట్టాయి. దీనిపై స్టే ఇవ్వాలని విజయ్ మాల్యా హైకోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై బ్యాంకులు ఈ నెల 13లోగా వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 06 , 2025 | 03:07 AM