ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: బ్లాక్ ఫ్రైడే.. ఒక్క రోజులోనే రూ.10 లక్షల కోట్లు హాంఫట్..

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:57 PM

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మదుపర్లలో నెగిటివ్ సెంటిమెంట్‌కు కారణమవుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత మరింత కిందకు దిగజరాయి.

Stock Market

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజులోనే మదుపర్లు సంపద రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మదుపర్లలో నెగిటివ్ సెంటిమెంట్‌కు కారణమవుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత మరింత కిందకు దిగజరాయి. సెన్సెక్స్ 73, 500 దిగువకు, నిఫ్టీ 22, 200 కిందకు పడిపోయాయి (Business News).


గురువారం ముగింపు (74, 612)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 400 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా నష్టాల్లోకి కూరుకుపోయింది. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. మధ్యాహ్నం తర్వాత నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరకు సెన్సెక్స్ 1414 పాయింట్ల భారీ నష్టంతో 73, 198 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఏకంగా 420 పాయింట్ల భారీ నష్టంతో 22, 124 వద్ద స్థిరపడింది. అన్ని ఇండెక్స్‌లు భారీ నష్టాలను చవిచూశాయి.


సెన్సెక్స్‌లో బందన్ బ్యాంక్, ఫియోనిక్స్ మిల్స్, కేఈఐ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి. బీఎస్‌ఈ లిమిటెడ్, గ్రాన్యుయల్స్ ఇండియా, ఛంబల్ ఫోర్ట్, ఎమ్‌సీఎక్స్ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1220 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 399 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.50గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2025 | 03:57 PM