ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: చివర్లో కొనుగోళ్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్

ABN, Publish Date - Jan 22 , 2025 | 04:17 PM

మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం చాలా వరకు నిస్తేజంగా కదలాడాయి. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే చివర్లో ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్లోకి దూసుకొచ్చాయి.

Stock Market

మంగళవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం చాలా వరకు నిస్తేజంగా కదలాడాయి. ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే చివర్లో ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాల్లోకి దూసుకొచ్చాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు దేశీయ సూచీల కారణంగా బుధవారం కూడా సూచీలు స్తబ్ధుగా కదలాడాయి. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. (Business News).


మంగళవారం ముగింపు (75, 838)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభనష్టాలతో దోబూచులాడింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు భారీ నష్టాలను చవిచూసినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం నిలదొక్కుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలు కావడంతో సెన్సెక్స్ భారీగా లాభపడింది. చివరికి 566 పాయింట్లు లాభపడి 76, 404 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 23, 155 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో ఎమ్‌సీఎక్స్ ఇండియా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఇండియా మార్ట్, మాక్రోటెక్ డెవలపర్స్, పాలీక్యాబ్, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్స్ నష్టాలను చవిచూశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 721 పాయింట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. బ్యాంక్ నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.32గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 22 , 2025 | 04:17 PM