Stock Market: అప్రమత్తంగా మదుపర్లు.. మళ్లీ నష్టాల బాటలో దేశీయ సూచీలు..
ABN, Publish Date - Jan 08 , 2025 | 10:22 AM
విదేశీ మదుపర్లు వరుసగా అమ్మకాలు సాగిస్తుండడం, హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ ఆందోళనల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. బుధవారం మళ్లీ నష్టాల బాటలో సాగుతున్నాయి.
విదేశీ మదుపర్లు వరుసగా అమ్మకాలు సాగిస్తుండడం, హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ ఆందోళనల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. బుధవారం మళ్లీ నష్టాల బాటలో సాగుతున్నాయి. బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం విదేశీ మదుపర్లు 1, 491 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేశారు. (Business News).
మంగళవారం ముగింపు (78, 199)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 120 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా కోల్పోయి 78, 082వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10: 15 గంటల సమయంలో 116 పాయింట్లు కోల్పోయి 78, 082 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే స్వల్ప లాభాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో 32 పాయింట్ల నష్టంతో 23, 676 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గెయిల్, ఆయిల్ ఇండియా షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్, కల్యాన్ జువెల్లర్స్, పేటీఎమ్, ఐజీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 487 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్ల నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.83గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 08 , 2025 | 10:22 AM