Stock Market: వరుస నష్టాలకు బ్రేకులు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్..
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:06 PM
బ్యాంకింగ్ సెక్టార్ రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి. బ్యాంకింగ్ వ్యవస్థకు నిధులు అందించడం కోసం దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను బహిరంగా మార్కెట్ కార్యకలాపాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధమవుతుండడంతో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సెక్టార్లు వరుసగా లాభాలను ఆర్జిస్తున్నాయి.
వరుస నష్టాలతో భారీగా పతనమైన దేశీయ సూచీలు మంగళవారం పుంజుకున్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ బ్యాంకింగ్ సెక్టార్ రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలను ఆర్జించాయి. బ్యాంకింగ్ వ్యవస్థకు నిధులు అందించడం కోసం దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను బహిరంగా మార్కెట్ కార్యకలాపాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ సిద్ధమవుతుండడంతో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సెక్టార్లు వరుసగా లాభాలను ఆర్జిస్తున్నాయి. (Stock Market News)
సోమవారం ముగింపు (75, 366)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత కొనగోళ్లు మరింత పెరిగాయి. దీంతో ఒక దశలో 1200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ 76, 512 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే చివర్లో అమ్మకాలు జరగడంతో లాభాలు ఆవిరయ్యాయి. చివరకు సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 75, 901 వద్ద రోజును ముగించింది. బ్యాంకింగ్ రంగ స్టాక్స్ బాగా రాణించాయి. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలను ఆర్జించింది. 128 పాయింట్ల లాభంతో 22, 957 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో చోలా ఇన్వెస్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించాయి. పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, సీడీఎస్‌ఎల్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు భారీగా నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ వరుసగా నష్టాలను నమోదు చేస్తోంది. ఈ రోజు కూడా 266 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. బ్యాంక్ నిఫ్టీ 802 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.52గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 28 , 2025 | 04:06 PM