ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: అమెరికా వడ్డీ రేట్లపై ఆశాభావం.. వరుసగా రెండో రోజూ లాభాలే..

ABN, Publish Date - Jan 29 , 2025 | 03:52 PM

గత కొద్ది రోజులగా వరుసగా నష్టపోతూ వస్తున్న స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ బుధవారం భారీ లాభాలను ఆర్జించాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రకటన స్టాక్ మార్కెట్లకు బూస్టింగ్ ఇస్తుందన్న అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా స్పందించాయి.

Stock Market

వరుస నష్టాలతో భారీగా పతనమైన దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ పుంజుకున్నాయి. గత కొద్ది రోజులగా వరుసగా నష్టపోతూ వస్తున్న స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ బుధవారం భారీ లాభాలను ఆర్జించాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రకటన స్టాక్ మార్కెట్లకు బూస్టింగ్ ఇస్తుందన్న అంచనాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా స్పందించాయి. దాంతో ఈ రోజు ఇండియన్ మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడాయి. అలాగే ప్రధాన షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ లాభాల్లో కదలాడాయి. (Business News)


మంగళవారం ముగింపు (75, 901)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 230 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత కొనగోళ్లు మరింత పెరిగాయి. చివరి గంటలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 76, 599 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 631 పాయింట్ల లాభంతో 76, 532 వద్ద రోజును ముగించింది. అన్ని రంగాలు లాభాలను ఆర్జించాయి. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలను ఆర్జించింది. 205 పాయింట్ల లాభంతో 23, 163 వద్ద రోజును ముగించింది. మళ్లీ 23 వేలకు ఎగువన రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో సీజీ పవర్, కేపీఐటీ టెక్నాలజీస్, ఐఈఎక్స్, జొమాటో షేర్లు లాభాలను ఆర్జించాయి. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, బోష్, అంబుజా సిమెంట్స్, బర్గర్ పెయింట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వరుస నష్టాలను ఎదుర్కొంటున్న స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్ బాగా లాభపడ్డాయి. ఈ రోజు మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు ఏకంగా 1189 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 299 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.54గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2025 | 03:52 PM