Stock Market: మళ్లీ నష్టాలే.. 73 వేల దిగువకు పడిపోయి కోలుకున్న సెన్సెక్స్..
ABN, Publish Date - Mar 03 , 2025 | 04:04 PM
గత కొన్ని వారాల్లో సెన్సెక్స్ ఏకంగా 12500 పాయింట్లకు పైగా కోల్పోవడం విశేషం. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడంతో సోమవారం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ లాభాలు ఎక్కువ సేపు నిలవలేదు. సెన్సెక్స్ ఒక దశలో 72, 800 దిగువకు పడిపోయింది.
శుక్రవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు సోమవారం కూడా అదే బాటలో కొనసాగాయి. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి వెళ్లిపోయాయి. గత కొన్ని వారాల్లో సెన్సెక్స్ ఏకంగా 12500 పాయింట్లకు పైగా కోల్పోవడం విశేషం. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడంతో సోమవారం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ లాభాలు ఎక్కువ సేపు నిలవలేదు. సెన్సెక్స్ ఒక దశలో 72, 800 దిగువకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకుంది. (Business News).
శుక్రవారం ముగింపు (73, 198)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 220 పాయింట్లకు పైగా లాభంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా కోల్పోయి 72, 784 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో కాస్త కోలుకుంది. ముఖ్యంగా చివరి గంటలో కొనుగోళ్లు జరిగాయి. చివరకు సెన్సెక్స్ 112 పాయింట్ల నష్టంతో 73, 085 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా కోల్పోయి చివరకు 5.4 పాయింట్ల స్వల్ప నష్టంతో 22, 119 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్, ఆర్‌ఈసీ షేర్లు లాభాలను ఆర్జించాయి. ఏంజెల్ వన్, బీఎస్‌ఈ లిమిటెడ్, ఇండియన్ రెన్యుబుల్ ఎనర్జీ, ఎమ్‌సీఎక్స్ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 68 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.37గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 03 , 2025 | 04:04 PM