ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: మార్కెట్లకు భారీ లాభాలు.. సెన్సెక్స్ 1400 పాయింట్లు జంప్..

ABN, Publish Date - Jan 02 , 2025 | 04:01 PM

గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు నూతన సంవత్సరం తర్వాత లాభాల బాటలో పయనిస్తున్నాయి. డిసెంబర్ వాహనాల సేల్స్‌లో పెరుగుదల నమోదు కావడం ఇతర రంగాల పైనా ప్రభావం చూపుతోంది. గురువారం అన్ని రంగాలు లాభాల్లో దూసుకెళ్లాయి.

Stock Market

గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు నూతన సంవత్సరం తర్వాత లాభాల బాటలో పయనిస్తున్నాయి. డిసెంబర్ వాహనాల సేల్స్‌లో పెరుగుదల నమోదు కావడం ఇతర రంగాల పైనా ప్రభావం చూపుతోంది. గురువారం అన్ని రంగాలు లాభాల్లో దూసుకెళ్లాయి. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా మదుపర్లు ఆశావహంతో ఉన్నారు. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ తిరిగి 24 వేల మార్క్ దాటింది. (Business News).


గురువారం ముగింపు (78, 507)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత లాభాల్లోకి దూసుకెళ్లింది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ ఒక దశలో 80 వేల మార్క్‌ను కూడా దేటేసింది. చివరకు 1436 పాయింట్ల లాభంతో 79, 943 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. చివరకు 445 పాయింట్ల భారీ లాభంతో 24, 188 వద్ద రోజును ముగించింది. చాలా రోజుల తర్వాత 24 వేల మార్క్‌ను దాటింది.


సెన్సెక్స్‌లో ఎయిచర్ మోటార్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, చోల ఇన్వెస్ట్, బజాజ్ ఫైనాన్స్, ఆయిల్ ఇండియా షేర్లు లాభాలు అందుకున్నాయి. పెట్రోనాట్ ఎల్జీ, అదానీ టోటల్ గ్యాస్, జిందాల్ స్టెయిన్ లెస్, డాక్టర్ లాల్‌పాథ్ ల్యాబ్స్, ఏంజెల్ వన్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 657 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 544 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.75గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2025 | 04:01 PM