పీఎన్‌బీ వడ్డీ రేట్ల తగ్గింపు
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:06 AM
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎ్‌సబీ) రిటైల్ రుణాలపై వడ్డీ రేటు తగ్గించింది. తమ గృహ, ఆటో, విద్య, వ్యక్తిగత రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును పావు శాతం (0.25ు) తగ్గిస్తున్నట్టు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎ్‌సబీ) రిటైల్ రుణాలపై వడ్డీ రేటు తగ్గించింది. తమ గృహ, ఆటో, విద్య, వ్యక్తిగత రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును పావు శాతం (0.25ు) తగ్గిస్తున్నట్టు పీఎన్‌బీ ప్రకటించింది. ఈ నెల 10 నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో పీఎన్‌బీ కనీస వడ్డీ రేటు గృహ రుణాలపై 8.15 శాతం, ఆటో రుణాలపై 8.5 శాతం, విద్యా రుణాలపై 7.85 శాతం, వ్యక్తిగత రుణాలపై 11.25 శాతం చొప్పున ప్రారంభమవుతుంది. కాగా వచ్చే నెలాఖరు వరకు తీసుకునే గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు కూడా ఉండవని పీఎన్‌బీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 21 , 2025 | 04:07 AM