మార్కెట్ ‘మండె’న్!
ABN, Publish Date - Feb 11 , 2025 | 03:55 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. లోహం, బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో అమ్మకాల కారణంగా సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకదశలో 753 పాయింట్లు క్షీణించింది....
మెటల్ షేర్లలో పోటెత్తిన అమ్మకాలు
సెన్సెక్స్ 548 పాయింట్లకు పైగా పతనం
4 రోజుల్లో రూ.7.68 లక్షల కోట్లు ఆవిరి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. లోహం, బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్లలో అమ్మకాల కారణంగా సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకదశలో 753 పాయింట్లు క్షీణించింది. చివరికి సూచీ 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 178.35 పాయింట్లు కోల్పోయి 23,381.60 వద్ద ముగిసింది. అమెరికాలోకి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియంపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తానంటూ ట్రంప్ ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణమైంది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల తరలింపు కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత కుంగదీసింది. గడిచిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,272 పాయింట్లు పతనమవగా..
ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.68 లక్షల కోట్లు తగ్గి రూ.417.82 లక్షల కోట్లు (4.77 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. బీఎ్‌సఈలో 4,225 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,125 నష్టపోయాయి. 993 లాభపడగా.. 107 యథాతథంగా ముగిశాయి. 192 కంపెనీల షేర్లు సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకోగా.. 2 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
లోహ రంగ షేర్ల నష్టాలు
కంపెనీ నష్ట శాతం
నాల్కో 4.83
సెయిల్ 4.67
వేదాంత 4.31
ఎన్‌ఎండీసీ 3.95
టాటా స్టీల్ 3.11
జేఎ్‌సడబ్ల్యూ స్టీల్ 2.20
హిందాల్కో 1.87
జిందాల్ స్టెయిన్‌లె్‌స 1.61
జిందాల్ స్టీల్ 0.72
Kumbh Mela 2025: కుంభమేళా ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇలా తెలుసుకోండి.. సులభంగా వెళ్లండి..
Viral News: సోడా సేవించి ముగ్గురు మృతి.. రంగంలోకి పోలీసులు
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 11 , 2025 | 03:55 AM