Budget 2025: పేదోడు విమానం ఎక్కేలా.. చవకగా ఫ్లైట్ టికెట్లు.. కేంద్రం అదిరిపోయే నిర్ణయం
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:13 PM
తాజా బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఉడాన్ పథకం ప్రకటించారు. మరో 120 రూట్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.
తాజా బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఉడాన్ పథకం ప్రకటించారు. మరో 120 రూట్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీహార్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. కాగా, మధ్యతరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సరికొత్త ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చారు.
Updated Date - Feb 01 , 2025 | 12:39 PM