Tirumala : టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు రూ.81 లక్షల విరాళం
ABN, Publish Date - Feb 27 , 2025 | 04:28 AM
టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు బుధవారం రూ.81 లక్షలు విరాళంగా అందాయి.
తిరుమల, ఫిబ్రవరి26(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు బుధవారం రూ.81 లక్షలు విరాళంగా అందాయి. చెన్నైకు చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.70 లక్షలు, వర ఫ్యూచర్ ఎల్‌ఎల్పీ అనే సంస్థ రూ.11 లక్షలు అందజేశాయి. ఈమేరకు దాత లు విరాళాల చెక్కులను తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేసి ప్రాణదానం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.
Updated Date - Feb 27 , 2025 | 04:28 AM