Devotee : కాలినడకమార్గంలో గుండెపోటుతో భక్తుడి మృతి
ABN, Publish Date - Feb 19 , 2025 | 06:01 AM
శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వస్తున్న ఓ తెలంగాణ భక్తుడు మంగళవారం గుండెపోటుతో మరణించాడు.
తిరుమల, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం కాలినడకన తిరుమలకు వస్తున్న ఓ తెలంగాణ భక్తుడు మంగళవారం గుండెపోటుతో మరణించాడు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్(50) కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీవారిమెట్టు మార్గంలో మంగళవారం ఉదయం తిరుమలకు బయలుదేరాడు. 400వ మెట్టు వద్ద ఒక్కసారిగా ఛాతినొప్పితో కుప్పకూలిపోయాడు. వెంటనే చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
Updated Date - Feb 19 , 2025 | 06:02 AM