ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మండలిలో వైసీపీ తీరు దారుణం: టీడీపీ

ABN, Publish Date - Mar 05 , 2025 | 06:08 AM

శాసనమండలిలో వైసీపీ సభ్యులు సబ్జెక్ట్‌ మాట్లాడకుండా గందరగోళం సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు.

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో వైసీపీ సభ్యులు సబ్జెక్ట్‌ మాట్లాడకుండా గందరగోళం సృష్టిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ... ‘ఉప కులపతుల రాజీనామాపై మంత్రి లోకేశ్‌ మండలిలో చర్చకు సబ్జెక్ట్‌తో వచ్చినా... వైసీపీ సభ్యులు చర్చను తప్పుదారి పట్టిస్తున్నారు. వీసీలతో బలవంతంగా రాజీనామాలు చేయించాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోంది’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని యోగ్యతలూ ఉన్నవారినేకూటమి ప్రభుత్వం వీసీలుగా నియమించిందన్నారు. బడ్జెట్‌పై చర్చ సాగనీయకుండా వైసీపీ సభ్యులు గందరగోళం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు.

Updated Date - Mar 05 , 2025 | 06:09 AM