ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బొత్స మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి: షర్మిల

ABN, Publish Date - Feb 21 , 2025 | 05:55 AM

‘బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో... పనిచేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నదెవరో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసన్నారు. ‘ఐదేళ్లూ ఖాళీగా ఉండి ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారు. ప్రజలు మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోతే వెంటనే రాజీనామా చేయాలి. ఇంట్లో కూర్చొని ప్రెస్‌ మీట్‌లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసింది’ అని షర్మిల అన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 05:56 AM