ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Leftist Writer : న్యాయ గ్రంథాల అనువాదకుడు పెండ్యాల కన్నుమూత

ABN, Publish Date - Feb 08 , 2025 | 04:17 AM

రచయిత, వామపక్షవాది పెండ్యాల సత్యనారాయణ(72) ఇకలేరు. ఆయన రాజమండ్రిలోని తన కుమార్తె ఇంట్లో గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): న్యాయ శాస్త్ర గ్రంథాల అనువాదకుడు, రచయిత, వామపక్షవాది పెండ్యాల సత్యనారాయణ(72) ఇకలేరు. ఆయన రాజమండ్రిలోని తన కుమార్తె ఇంట్లో గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ స్వస్థలం గుంటూరు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అత్యంత క్లిష్టమైన న్యాయ శాస్త్ర గ్రంథాలను వ్యవహారిక తెలుగులో అనువదించిన ఘనత పెండ్యాల సత్యనారాయణ సొంతం. న్యాయశాస్త్ర విద్యార్థులకు, న్యాయవాదులకు, పోలీస్‌ అకాడమీ వారికి ఆయన అనువాదాలు ఎంతగానో తోడ్పడ్డాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ తదితర కొత్త చట్టాలను, భారత రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించారు. పెండ్యాల చివరి కోరిక మేరకు ఆయన భౌతిక కాయాన్ని రాజమండ్రిలోని జీఎ్‌సఎల్‌ కళాశాలకు అప్పగించారు.

Updated Date - Feb 08 , 2025 | 04:18 AM