ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ongole: రెచ్చిపోయిన తులసి బాబు అనుచరులు.. ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే..

ABN, Publish Date - Jan 08 , 2025 | 04:07 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసి బాబు రెచ్చిపోయారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తులసి బాబు, అతని అనుచరులు ఓవరాక్షన్ చేశారు.

Kanumuru Raghu Rama Krishna Raju

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసి బాబు రెచ్చిపోయారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తులసి బాబు, అతని అనుచరులు ఓవరాక్షన్ చేశారు. విజయవాడ నుంచి అనుచరులతో కలిసి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తులసి బాబు చేరుకున్నారు. అయితే అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంలోకి నేరుగా వెళ్లే ప్రయత్నించారు తులసి బాబు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం


అందరినీ లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు, తులసి బాబు అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెచ్చిపోయిన అతని అనుచరులు ఎస్పీ కార్యాలయం ఎదుటే "జై తులసి అన్న" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయినప్పటికీ తులసి బాబుని ఒక్కడినే విచారణ నిమిత్తం పోలీసులు ఎస్పీ కార్యాలయంలోకి అనుమతించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసిబాబుపై ఆరోపణలు ఉన్నాయి.

వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..


మరోవైపు, ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్‌ ఇప్పటికే అరెస్టయ్యి గుంటూరు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, విజయ్ పాల్‌, తులసి బాబు ఇద్దరినీ ఇవాళ (బుధవారం) ప్రకాశం జిల్లా పోలీసులు విచారణ చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులకు ఒకరోజు కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడిని ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకువస్తున్నారు. విజయ్ పాల్, తులసి బాబును ఇద్దరినీ కలిపి ఎస్పీ దామోదర్ విచారణ చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక సూచనలు

Updated Date - Jan 08 , 2025 | 04:12 PM