10th Exams: టెన్త్ ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు
ABN, Publish Date - Feb 20 , 2025 | 05:55 AM
ఇప్పటివరకూ టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తుండగా తొలిసారి స్కూల్ అసిస్టెంట్లు(ఎ్‌సఏ), భాషా పండితులకు ఇన్విజిలేషన్ బాధ్యత అప్పగించనుంది.
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక మార్పు చేసింది. ఇప్పటివరకూ టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తుండగా తొలిసారి స్కూల్ అసిస్టెంట్లు(ఎ్‌సఏ), భాషా పండితులకు ఇన్విజిలేషన్ బాధ్యత అప్పగించనుంది. ఈ మేరకు ఎస్‌ఏలను ఇన్విజిలేటర్లుగా నియమించాలని ఆదేశిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ ఉండాలని స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్లు సరిపోకపోతే ఎస్జీటీలను తీసుకోవాలని సూచించింది. కాగా.. ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఎప్పటిలాగే ఎస్జీటీలను నియమించాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు సీవీ.ప్రసాద్ కోరారు.
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు మే నెల జీతం చెల్లించండి
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు 2024 మే నెల జీతం చెల్లించాలని కాంట్రాక్టు లెక్చరర్ల జేఏసీ నేతలు కుమ్మరకుంట సురేష్, కల్లూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు జేఎల్స్‌కు 11 నెలల జీతం ఇస్తున్నారని, కానీ గతేడాది మేలో ఫెయిల్ అయిన విద్యార్థులకు శిక్షణ తరగతులకు తమను వినియోగించుకున్నారని తెలిపారు. తీవ్రమైన ఎండల్లో పనిచేసినందున ఆ నెల జీతం ఇప్పించాలని సీఎంను కోరారు.
ఇవి కూడా చదవండి:
Anti Corruption: అవినీతిని అరికట్టేందుకు కీలక చర్యలు.. 52 మంది అధికారుల సస్పెండ్
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 20 , 2025 | 05:55 AM