ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ABN, Publish Date - Jan 26 , 2025 | 12:25 AM
ఓటు వజ్రాయుధమని, ఓటు ప్రాముఖ్యతను గుర్తించాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ రవణమ్మ సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ సాజిద్‌బాషా అన్నారు.
ఆత్మకూరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఓటు వజ్రాయుధమని, ఓటు ప్రాముఖ్యతను గుర్తించాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ రవణమ్మ సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ సాజిద్‌బాషా అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీనియర్ సిటిజన్లను సత్కరించారు. అలాగే ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఓటరు బాధ్యతను కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నేతృత్వంలో విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యంపై వివరించారు.
మహానంది: గాజులపల్లిలో ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం గ్రామంలోని 9 పోలింగ్ బూత్‌లలో బీఎల్వోల ఆధ్వర్యంలో హెచ్‌ఎం రవణమ్మ ప్రతిజ్ఞ చేయించారు. బీఎల్వోలు ఇర్పాన్, లింగమయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: బండిఆత్మకూరులో ఓటర్ల దినోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. ప్రతిజ్ఞ చేయించారు. డీటీ గురున్నాథం తదితరులు పాల్గొన్నారు.
పాణ్యం: ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పాణ్యం తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డి అన్నారు. తహసీల్దారు కార్యాలయంలో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు మండల పరిధిలోని సీనియర్ ఓటర్లను సన్మానించారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు ఓటరు కార్డులు అందజేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ సేవలందించిన మహేష్‌భాబు, విశ్వవాణి, పద్మభూషణమ్మ, ప్రవీణ్‌కుమార్‌కు ఉత్తమ బీఎల్‌వో అవార్డులు అందజేశారు. డీటీ శివశంకరరెడ్డి, ఆర్‌ఐ రాము, ఎంపీటీసీ రంగరమేష్, మాజీ ఉపసర్పంచ్ రమణమూర్తి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఓటర్ల దనోత్సవాన్ని నిర్వహించారు. వడ్డుగండ్ల, రసూల్లపేట గ్రామాలలో ఓటరు దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కోఆర్డినేటర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.
పగిడ్యాల: ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంపీడీవో సుమిత్రమ్మ సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాని పురస్కరించుకొని శనివారం పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వీఆర్వోల ఆధ్వర్యంలో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు.
కొత్తపల్లి: ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ పెద్దన్న సూచించారు. శనివారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి ఓటర్ల దినోత్సవాన్ని ప్రతిజ్ఞ చేయించారు.
Updated Date - Jan 26 , 2025 | 12:25 AM