ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.300 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌: ఎమ్మెల్యే బుడ్డా

ABN, Publish Date - Jan 31 , 2025 | 01:17 AM

మహానంది ఆలయ అభివృద్ధికి రూ.300 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు.

మహానందిలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

మహానంది, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మహానంది ఆలయ అభివృద్ధికి రూ.300 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినట్లు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. గురువారం మహానంది ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానంది నుంచి ఎంసీ ఫారం వరకు ఉన్న 3 కిలో మీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణంతో పాటు పాలేరు వాగు వంతెన నిర్మాణానికి రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అలాగే మహానంది తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం దేవస్థానం ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. తెలుగు గంగ లైనింగ్‌ పనుల విషయంపై మరో సారి సీఎంతో చర్చించి పూర్తి చేస్తామన్నారు. శ్రీశైలం, మహానంది క్షేత్రా లను ఒక కారిడర్‌గా చేసి కేంద్ర ప్రభుత్వ ప్రసాదం నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. సాయంత్రం యు.బొల్లవరంలో సీసీ రహదార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కేసీ కెనాల్‌ చైర్మన్‌ రామలింగారెడ్డి, ఎంపీపీ యశస్వీని, టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి చంద్రమౌళీశ్వరరెడ్డి, తెలుగు యువత లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి క్రాంతికుమార్‌, మండల అధ్యక్షుడు మధు, టీడీపీ నాయకులు శ్యామల జనార్దన్‌రెడ్డి, మల్లికార్జున, ప్రసాదరావు, రవినాథరావు, మహేశ్వరరెడ్డి, సుబ్రహ్మణ్యం, ఉమాదేవి, సరోజమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:17 AM