ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం: సీపీఎం

ABN, Publish Date - Feb 03 , 2025 | 12:05 AM

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని సీపీఎం నాయకులు ఆరోపించారు.

నంద్యాలలో ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

నంద్యాల రూరల్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని సీపీఎం నాయకులు ఆరోపించారు. పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఆదివారం 2025-26 కేంద్ర బడ్జెట్‌ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ల కోసం ప్రవేశపెట్టినట్లు ఉందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు తోటమద్దులు, వెంకటలింగం, సుబ్బారావు, జైలాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం నాయకుడు రణధీర్‌ ఆరోపించారు. ఆదివారం కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పక్కనబెట్టి ఏపీకి అన్యాయం చేశారని ఆరోపించారు. నాయకులు రామ్‌నాయక్‌, సురేంద్ర, నాగేశ్వరరావు, వీరన్న, భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:05 AM