ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో అధిక దిగుబడి’

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:37 AM

రైతులు పంటలకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఎ.రామకృష్ణారావు అన్నారు.

రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్త రామకృష్ణారావు

మిడుతూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రైతులు పంటలకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఎ.రామకృష్ణారావు అన్నారు. మండలంలోని తిమ్మాపురం, మిడు తూరు గ్రామాల్లో గురువారం శనగ పంటలో గ్యాప్‌ పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్త రైతులతో మాట్లాడుతూ శనగ పంటలో ప్రస్తుతం లద్దె పురుగు, కాయ తొలిచే పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు వివరించారు. విత్తనం విత్తినప్పటి నుంచి 25 రోజుల వరకు గుడ్డు సముదాయాన్ని ఏరి నాశనం చేయాలని సూచించారు. ఎకరాకు 10,000 పీపీఎం వేపనూనెను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి పీరునాయక్‌, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:37 AM