ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి: మంత్రి

ABN, Publish Date - Jan 23 , 2025 | 12:44 AM

కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమ, అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

పనులను ప్రారంభిస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమ, అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. నంద్యాలలోని 37, 38వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణాలకు మంత్రి ఫరూక్‌ బుధవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ, గ్రామాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి కార్యక్రమాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా చేస్తున్నామని సంక్షేమంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని, నాణ్యవంతమైన నిర్మాణాలు చేపట్టాలని కాంట్రాక్టర్లకు మంత్రి ఫరూక్‌ ఆదేశించారు. నందమూరినగర్‌, వైఎస్‌నగర్‌లలోని సమస్యలను ప్రజలనుంచి ఆయన తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా, టీడీపీ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, కౌన్సిలర్లు ఖండే శ్యాంసుందర్‌లాల్‌, నాగార్జున, జైనాబీ, శ్రీదేవి, మహబూబ్‌వలి, ఆయా వార్డుల ఇన్‌చార్జులు తాటికొండ బుగ్గరాముడు, దేరెడ్డి శివనాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 12:44 AM