ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

15 టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌

ABN, Publish Date - Jan 31 , 2025 | 01:20 AM

అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న 15 టన్నుల ప్రజా పంపిణీ(రేషన్‌) బియ్యంను పోలీసులు సీజ్‌ చేశారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం వాహనం

ఆదోని, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న 15 టన్నుల ప్రజా పంపిణీ(రేషన్‌) బియ్యంను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ఆదోని మీదుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారని గురువారం విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. వెంటనే అధికారులు తాలూకా సీఐ నల్లప్పకు సమాచారం ఇచ్చారు. ఇస్వీ ఎస్‌ఐ నాగేంద్రను ధనాపురం గ్రామం దగ్గర రేషన్‌ బియ్యం లారీ కోసం వేచి ఉన్నారు. ఈలోగా లారీ రావడంతో లారీని ఆపేందుకు ఎస్‌ఐ ప్రయత్నిం చాడు. డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. సమా చారం అందుకున్న సీఐ నల్లప్ప ఆదోనిలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్‌ దగ్గర వాహనాన్ని అడ్డుకున్నారు. గుంతకల్లు నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు డ్రైవర్‌ నాగరాజు, మరో డ్రైవర్‌ మల్లికార్జునలు తెలిపారు. లారీని సీజ్‌ చేసి తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 01:20 AM