ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Posani Krishna Murali: పోసానికి ఓ కేసులో షాక్.. రెండు కేసుల్లో ఊరట

ABN, Publish Date - Mar 06 , 2025 | 03:52 PM

Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్, లోకేష్‌లను దూషించిన వ్యవహారంలో పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసుల వరకు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

Posani Murali Krishna

అమరావతి, మార్చి 6: సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆదోని కేసులో ఎదురుదెబ్బ తగులగా.. మరో రెండు కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. తనపై పెట్టిన కేసులను కొట్టివేయలంటూ పోసాని కృష్ణ మురళి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తనపైన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది.


ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక విశాఖలోని పద్మనాభం పోలీస్‌ స్టేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సూళ్ళూరు పేట, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులలో పీటీ వారెంట్ అమలు కాలేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ నివేదించారు. ఈ నాలుగు కేసులకు సంబంధించి పిటిషనర్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని సూచించింది. బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 35(3)కి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులకు హైకోర్ట్ స్పష్టం చేసింది.

Watchman Ranganna Wife: నా భర్త మృతిపై పలు అనుమానాలు.. రంగన్న భార్య షాకింగ్ కామెంట్స్


కాగా.. చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లను దూషించారంటూ పోసాని కృష్ణ మురళిపై టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై దాదాపు 16 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత నెలలో (ఫిబ్రవరి 28న) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని పీటీ వారెంట్‌తో నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఆపై ఆదోని మూడో పట్టణ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని గుంటూరు జైలు నుంచి తీసుకొచ్చి ఆదోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఇన్‌చార్జి మేజిస్ర్టేట్‌ అపర్ణ ఎదుట హాజరుపరిచారు. న్యాయాధికారి ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. తనను ఆదోని జైలులో కాకుండా కర్నూలు జిల్లా జైలులో ఉంచాలని పోసాని కోరగా.. ఆయన విజ్ఞప్తి మేరకు కర్నూలు జిల్లా జైలుకు పంపుతూ మేజిస్ర్టేట్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయనను కర్నూలు శివారులోని పంచలింగాలలో ఉన్న జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.


ఇవి కూడా చదవండి...

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు

Chandrababu - Modi Tweet: ఎమ్మెల్సీల విజయంపై మోదీ అభినందనలు.. థాంక్స్ చెప్పిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2025 | 04:14 PM