Thermal Power: ‘థర్మల్’తో అభివృద్ధి.. బూటకమే!
ABN, Publish Date - Feb 17 , 2025 | 02:16 AM
మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథం, ప్రచారకర్త అనూరాధతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు.
భావితరాలను కాపాడుకోవాలంటే పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాన్ని విరమించుకోవాలి
మానవ హక్కుల వేదిక కన్వీనర్ వీఎస్ కృష్ణ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): థర్మల్ పవర్ ప్లాంట్‌తో అభివృద్ధి అని చెప్పడం బూటకమని మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త వీఎస్ కృష్ణ పేర్కొన్నారు. మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథం, ప్రచారకర్త అనూరాధతో కలిసి శ్రీకాకుళం జిల్లాలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధి వెన్నెలవలస, మసనపుట్టి, బొట్లపాడు, తిమ్మిడం, జంగాలపాడు గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం వీఎస్ కృష్ణ మాట్లాడుతూ.. ‘పంట భూములతో ఉన్న ఆదివాసీ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చి మానవాళి మనుగడకు ప్రమాదం కల్పించొద్దు. ప్రపంచ దేశాలు 2050 నాటికి థర్మల్ పవర్ ప్లాంట్లను మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను తీసుకొస్తానని స్థానిక(ఆమదాలవలస) ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రకటించడం హాస్యాస్పదం. కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి విషతుల్య కర్బన ఉద్గారాలను వెదజల్లే థర్మల్ ప్లాంట్‌తో అభివృద్ధి సాధ్యమని ఎలా చెప్పగలరు’ అని ప్రశ్నించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రాబోయే ప్రమాదాన్ని ముందుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భావితరాలను కాపాడుకోవాలంటే పవర్ ప్లాంట్ ఈ ప్రాంతంలో నిర్మించే ప్రయత్నాన్ని పాలకులు విరమించుకునేంత వరకు ప్రజలు పోరాటానికి ముందు వరుసలో ఉండాలని కోరారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..
Updated Date - Feb 17 , 2025 | 02:16 AM