ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court : పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయండి‘టోల్‌గేట్‌ వీడియో’ ప్రేమ్‌కుమార్‌

ABN, Publish Date - Mar 05 , 2025 | 05:28 AM

ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందు కు పోలీసులకు హైకోర్టు మరికొంత సమయం ఇచ్చింది.

  • అరెస్ట్ పై పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందు కు పోలీసులకు హైకోర్టు మరికొంత సమయం ఇచ్చింది. విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందనరావు నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చిం ది. రోడ్లు వేసినందుకుగాను టోల్‌గేట్లు పెట్టి కూటమి ప్రభుత్వం వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోందంటూ ప్రేమ్‌కుమార్‌ తన అనుచరులతో ఓ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడమే కాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్నూలు ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. తన తండ్రిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు ముందు హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలని కోరతూ కొరిటిపాటి అభినయ్‌ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ మంగళవారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ నిందితులను అరెస్ట్‌ చేసే విషయంలో పోలీసులు చట్టనిబంధనలను అనుసరించడం లేదన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 05:28 AM