ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fake currency: గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం

ABN, Publish Date - Jan 27 , 2025 | 11:53 AM

దేశంలో రోజు రోజుకు దొంగనోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ ఖాతాదారుడు అంజిబాబు డబ్బులు డిపాజిట్ చేశాడు. అయితే డిపాజిట్ చేసిన డబ్బుల్లో దొంగనోట్లు జమ అయినట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. దీనిపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Fake Currency in Guntur Dist

గుంటూరు జిల్లా: దేశంలో ఫేక్ నోట్లు (Fake currency) ఎక్కువైపోతున్నాయి.. దీనిపై ఆర్‌బీఐ (RBI) ఆందోళన వ్యక్తం చేస్తోంది.‘ ధనం మూలం ఇదం జగత్’ అనే సామెత ఉంది కదా.. ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే ఈ డబ్బు పిచ్చితో, సులభంగా సంపాదించాలనే ఆలోచనతో కొందరు మోసగాళ్లు వృద్ధులు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని కలర్ జిరాక్స్ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారు, భారీమొత్తంలో నగదు అవసరమున్నవారే మోసగాళ్ల లక్ష్యం. డబ్బు అవసరం ఉన్న వారిని ఎంచుకుని వల విసురుతారు. పెద్దమొత్తంలో నగదు వస్తుందంటూ ఆశ చూపుతారు.

ఈ వార్త కూడా చదవండి..

పోలీసుల కస్టడీకి తులసిబాబు..


తొలుత కొంతమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటూ వారిని ఉచ్చులోకి లాగుతారు. ఆ తర్వాత కొంతమొత్తంలో నగదుతోపాటు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇలా ఒకేటేంటి రకరకాలుగా అవతలి వ్యక్తుల వద్ద ఉన్నవి ఊడ్చేస్తారు. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న నకిలీ నోట్ల చలామణి. కొన్నేళ్లుగా సద్దుమణిగిన ఈ వ్యాపారం మళ్లీ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాల్లో (Guntur Dist.,) దొంగ నోట్లు కలకలం రేగింది. తాడేపల్లి మండలం, కుంచనపల్లి గ్రామంలో దొంగ నోట్ల కలకలం సృష్టించింది. అంజిబాబు అనే ఖాతాదారుడు జమ చేసిన నగదులో దొంగ నోట్లు కనిపించాయి. దీంతో బ్యాంక్ అధికారులు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగ నోట్ల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు రోజుల క్రితం.. తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే వ్యక్తి ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశాడు. అయితే డిపాజిట్ చేసిన నోట్లలో రూ.18 వేలు దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్‌లో ఆ మొత్తం జమ కాలేదు. దీంతో తాను రూ. 50 వేలు డిపాజిట్ చేయగా అందులో రూ. 18 వేలు డిపాజిట్ కాలేదని బ్యాంకు మేనేజర్‌కు అంజిబాబు ఫిర్యాదు చేశాడు. దీంతో.. దానిపై ఆరా తీశారు బ్యాంకు అధికారులు.. ఖాతాదారుడు జమ చేసిన సొమ్ములో 18 వేల రూపాయలు దొంగ నోట్లుగా గుర్తించారు. అనంతరం దొంగ నోట్ల వ్యవహారంపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అసలు అంజిబాబుకు దొంగనోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. అతనికి ఎవరు డబ్బులు ఇచ్చారు.. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చాయి.. అనే కోణంలో తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..

హుస్సేన్‌సాగర్‌ అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 27 , 2025 | 11:53 AM